కాజాలు
వినియోగంలో కావలసినవి:
మైదాపిండి-పావుకేజీ, పంచదార-అరకేజీ, నెయ్యి-పావుకేజీ, పేరిననెయ్యి- అరకప్పు, తనేసోడా- అరస్పూను, బియ్యంపిండి-5 స్పూన్సు.
తయారుచేయు విధానం:
1. మైదాపిండిలో పేరిననెయ్యి వేసి, తినేసోడా, నీళ్ళు కలిపి, గట్టిగా పిండి కలుపుకోవాలి. 2 గంటలు నానబెట్టాలి.
2. నానిన పిండి పీటమీద వేసి బాగా మర్దనా చేయాలి. ఈ పిండి పెద్ద పెద్ద ఉండలు చేసి, చపాతీలు లాగా వత్తాలి.
3. పేరిననేతిలో బియ్యంపిండి వేసి కలిపి, చపాతీపై రాయాలి.
4. చపాతీని అంగుళం వెడల్పున ఉండేటట్లు చుడుతూ, మడత మడతకు బియ్యంపిండి ముద్ద రాయాలి.
5. చుట్టిన చపాతీని అంగుళం ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలు పళ్ళెంలో వుంచుకోవాలి.
6. పావుకిలో పంచదారలో కొద్దిగా నీళ్ళుపోసి, పొయ్యిమీద ఉంచి లేతపాకం పట్టి వుంచుకోవాలి.
7. మూకుడులో నెయ్యికానీ, డాల్డాకానీ పోసిన తరువాత, మూకుడులో ముక్కలు దోరగా వేయించి పాకంలో వేసి,
తీసి మరల పళ్ళెంలో వుంచాలి అలా అన్నీ పాకంలో వేసి తీయాలి.
8. మిగిలిన పంచదార పాకంపట్టి, తీసిన కాజాలు ఈ పాకంలో వేసి తీయాలి.
9. రెండుసార్లు పాకంలో పట్టివేయటం వలన చాలా రుచిగానూ వుంటాయి. 10 రోజుల వరకు నిల్వ వుంటాయి.