1000 Health Tips: Jalebi sweet recipe. సులువుగాచేసుకొండిలా

Jalebi sweet recipe. సులువుగాచేసుకొండిలా

 


జిలేబి తయారుచేయు విధానం:


కావలసినవి:

మైదాపిండి-పావుకేజీ, కొట్టిన బియ్యంపిండి-3 స్పూన్సు, చక్కెర-పావుకేజీ, నెయ్యి-350 గ్రా., చిటికెడు సోడా, పుల్లమజ్జిగ-అరకప్పు, మిఠాయి రంగు-అర స్పూను.


తయారుచేయు విధానం:

1 సాయంత్రం జిలేబి చేస్తామనగా ప్రొద్దుటే మైదాపిండి, బియ్యంపిండి వేసి, సోడా కూడా కలిపి, పుల్లమజ్జిగ పోసి, గరిట జారుగా నీళ్ళుపోస్తూ ఒక గిన్నెలో కలుపుకోవాలి.


2. పిండి బాగా పులిసి, బుర బురలాడుతూ వుండాలి. వేళ్ళతో పటుకొంటే పిండి తీగలాగా రావాలి, లేనిచో మరికొంతసేపు నాననివ్వాలి.


3. నానిన పిండిన మజ్జిగ కవ్వంతో బాగా చిలకాలి. అప్పుడు నురగమాదిరి వస్తుంది పిండిని ఎంత బాగా చిలికితే అంత చక్కగా జిలేబి వస్తుంది.


4. ఒక వెడల్పాటి మూకుడులో నెయ్యిపోసి, పొయ్యి మీద వుంచాలి.


5. ఖాళీ కొబ్బరిచిప్పకు అడుగున ఒక చిన్న రంధ్రం చేసి, అందులో పిండి వేసి రెండు చుట్టలు తిప్పి, మరల వేలు

ఆడ్డం పెట్టి, ఇంకో జిలేబి వేయాలి. జిలేబి అయిపోగానే వేలు అడ్డం పెట్టవలెను.


6. కొబ్బరి చిప్పని జిలేబి వేసేటప్పుడు పళ్ళానికి ఎంత ఎత్తులో పట్టుకొంటే అంత నైసుగా వస్తుంది.


7. ముందుగానే పంచదారను నీళ్లుపోసి, లేతపాకం పట్టి ప్రక్కపొయ్యి మీద సన్నని సెగమీద వుంచాలి. ఒక అరస్పూను మిఠాయి రంగు పాలల్లో కలిపి, పాకంలో వేస్తే, జిలేబికి రంగు అంటుకొని చాలా బావుంటుంది.


8. గోధుమ రంగులో వేగిన జిలేబి పాకంలో వేసి, తీసి ప్రక్కన పెట్టుకోవాలి. తరువాత అన్ని జిలేబీలు పాకంలో వేసి చివరికి మిగిలిన పాకం అంతా పోయాలి. ఇవి 4, 5 రోజులు పాడవకుండా వుంటాయి.