ఇలంబ్రీ కాయలు తయారుచేయు విధానం:
కావలసినవి:- మైదాపిండి-అరకేజీ, కొబ్బరిచిప్పలు-2, పంచదార-పావుకేజీ, నెయ్యి లేక డాల్డా- 350 గ్రా.
తయారుచేయు విధానం:
1. మైదాపిండి జల్లించి వుంచుకోవాలి.
2. కొబ్బరి కోరి, రోట్లో మెత్తగా రుబ్బి, పల్చని గుడ్డలో వడకట్టిపాలు తీయాలి.
3. కొబ్బరి పాలతో మైదాపిండి కలుపుకోవాలి. ఈ ముద్ద 2 గంటలు నానబెట్టాలి.
4. నానిన తరువాత చిన్న చిన్న వుండలు చేసుకొని, చాకుతో 4, 5 గాట్లు పెట్టాలి. చివరలు కట్చేయకూడదు.
5. చివరలు చేతితో గట్టిగా నొక్కాలి. మూకుడులో డాల్డా వేసి, కాగిన తరువాత ఈ ఉండలు అందులో గోధుమరంగు వచ్చేంతవరకు వేయించాలి.
6. పంచదార పాకంపట్టి అందులో యివి వేగిన తరువాత వేయాలి. ఇవి వారం రోజులవరకు నిల్వ వుంటాయి.