ఢిల్లీ దర్బార్ తయారుచేయు విధానం:
కావలసినవి: పాల విరుగుడు-2కప్పులు, పాలకోవా-అరకప్పు, మైదాపిండి-14 కప్పు, పంచదార-4 కప్పులు, నెయ్యి-2 కప్పులు, ఏలకులు-6, తినేసోడా-కొంచెం.
తయారుచేయు విధానం:
1. ముందుగా తయారు చేసుకొన్న కోవా, పాలవిరుగుడు రెండూమెత్తగా వెన్నలా రుబ్బుకోవాలి. రుబ్బిన ముద్ద నీళ్ళలో వేసినప్పుడు కోవా, విరుగుడు సమంగా రుబ్బినట్లు తేలలేనప్పుడు మరల రుబ్బుకోవాలి.
2. మైదాపిండిలో కరిగించిన నెయ్యి ఒక టేబుల్ స్పూను వేసి వుండలా కట్టకుండా కలపాలి.
3. తేనె సోడా నీళ్ళలో కలిపి, దీనిని మైదాపిండిలో కలపాలి. ఈ ముద్ద, కోవా, విరుగుడు పాలు కలిపి రుబ్బిన ముద్దలో కలిసిపోయేటట్లుగా వుండాలి. ఇందులో పొడి చేసిన ఏలకులు వేయాలి.
4. మైదాపిండి ముద్ద పాలకోవా, పాల విరుగుడు ముద్ద కలిపి మృదువుగా అయ్యేంతవరకూ మర్దన చెయ్యాలి.
5. ముద్దను రెండు భాగాలుగా చేసి వత్తాలి అరంగుళం మందంలో వత్తాలి. దానిని డైమండ్ ఆకారంలో ముక్కలు కోసి పళ్ళెంలో దూరం దూరంగా వుంచాలి.
6. నాలుగు కప్పుల పంచదారలో మూడు కప్పుల నీరుపోసి తీగపాకం పట్టాలి.
7. ఒక మూకుడులో నెయ్యిపోసి బాగా కాగిన తరువాత కోసి వుంచుకున్న ముక్కలు రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. వేగిన వాటిని పాకంలో వేయాలి.
8. ఈ ముక్కల్ని పాకంలో అరగంటసేపు నానబెట్టి, జాగ్రత్తగా తీసి పళ్ళెంలో వుంచాలి.
9. మిగిలిన పాకాన్ని మరో కప్పు చక్కెర వేసి, నీళ్ళు పోసి ముదురు పాకం పట్టి, స్పూన్తో ఒక్కొక్క ముక్క మీద వేయాలి. ఇవి చాలా రుచిగా వుంటాయి.
