1000 Health Tips: కాంతి తయారుచేయు విధానం:

కాంతి తయారుచేయు విధానం:

 


కాంతి తయారుచేయు విధానం:


కావలసినవి: గోధుమపిండి-2 కప్పులు, నెయ్యి-1/2 కప్పు, పంచదార-2 కప్పులు,


పూర్ణానికి :- పాలపొడి-2 కప్పు, సీమబాదం పప్పులు-10, జీడిపప్పు-10, కిస్మిస్-10, ఏలకులు-4.


తయారుచేయు విధానం:


1. గోధుమ పిండిలో రెండు ఉప్పురాళ్ళు వేసి, బాగా కాచిన నెయ్యి లేదా డాల్డా వేసి కలిపి మూతపెట్టాలి.


2. నానబెట్టి ఉంచుకొన్న సీమబాదం పప్పు తోలు తీసి, జీడిపప్పుతో కలిపి మెత్తగా రుబ్బాలి. ఏలకులు పొడి చేసుకోవాలి. కిస్మిస్లో గింజ, తోలు తీసి దంచి వుంచుకోవాలి.


3. రెండు స్పూన్ల పంచదార దంచి, పాలపొడిలో వేసి, నూరిన సీమ బాదం, జీడిపప్పు ముద్ద, ఏలకులపొడి, కిస్మిస్ ముక్కలు అన్నీ కలిపి, నీళ్ళు పోస్తూ తడి తడిగా ఉంచుకోవాలి.


4. గోధుమపిండి చిన్న చిన్న వుండలుగా చేసి, పూరీల మాదిరి వత్తి, అందులో కోవాను పెట్టి, పైన యింకో పూరీ వేసి

కప్పుకోవాలి. అంచులు అతుక్కొనేట్లు నొక్కి, అంచులు వెనక్కి మడిచి, మధ్యలో ఎత్తుగా తయారుచేయాలి.


5. పంచదారలో నీళ్ళు పోసి, పాకం పట్టి ఉంచుకోవాలి ముదురు పాకం రావాలి.


6. మూకుడులో నెయ్యి కాని, డాల్డా గాని పోసి, మరిగిన తరువాత, గోధుమరంగు కాంతులు వచ్చేంతవరకు వేయించి, పళ్ళెంలో పెట్టి, పైన పాకం పోయాలి. ఇవి 4, 5 రోజులవరకు నిల్వ ఉంటుంది.