1000 Health Tips: దానం చేయగలిగే అవయవాలు మరియు కణజాలాల రకాలు

దానం చేయగలిగే అవయవాలు మరియు కణజాలాల రకాలు


దానం చేయగలిగే అవయవాలు

గుండె

ఊపిరితిత్తుల

మూత్రపిండాలు

కాలేయం

క్లోమము

దానం చేసే కణజాలం

కంటి కణజాలం

ఎముక

చర్మం

స్నాయువులు

గుండె కణజాలం

అనారోగ్యంతో బాధపడుతున్న లేదా చనిపోతున్న ఎందరో ప్రజల జీవితాలను గణనీయంగా మెరుగుపర్చడానికి అవయవాల మరియు కణజాల దానం ఉపయోగపడుతుంది. అవయవ వైఫల్యాలతో తీవ్రమైన లేదా క్లిష్టమైన అనారోగ్యం తో బాధపడుతున్న వారికి అవయవ మార్పిడి ఒక్కటే ఆరోగ్యవంతమైన జీవనానికి ఆశ. మరణించిన వారి (దాత) అవయవ మరియు కణజాలాలను చాలా అనారోగ్యం లేదా మరణిస్తున్న (గ్రహీత)కు మారస్తారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగు మరియు క్లోమం లాంటి అవయవాలను మార్పిడి చేయవచ్చు. గుండె కవాటాలు మరియు ఇతర హృదయ కణజాలాలు, ఎముక, కండరాలు, స్నాయువులు, చర్మం మరియు కంటి భాగాలు కర్నియా లేదా స్కాలేరా లాంటి కణజాలాలను మార్పిడి చేయవచ్చు.


దానం చేయగలిగే అవయవాలు

గుండె

గుండె శరీరంలో రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం అన్ని ఇతర అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తుంది. గుండె సరిగా రక్తం సరఫరా చేయలేకపోతే, మిగిలిన శరీరం తొందరగా జబ్బు పడొచ్చు. గుండె వైఫల్యం, వైరల్ సంక్రమణ, లేదా గుండె లోపం కలవారికి గుండె మార్పిడి అవసరం. ఇతర రకాల వైద్య చికిత్సలు అన్ని విఫలమయితే గుండె మార్పిడి నిర్వహిస్తారు. ఒక మానవ గుండె లభించే దాకా కృత్రిమ హృదయాన్నితాత్కాలికంగా ఉపయోగించవచ్చు . మొత్తం గుండె మార్పిడికి వీలు కాకాపోతెగుండెలోని వాల్వులను దానం చేయవచ్చు.


ఊపిరితిత్తుల

ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్ అందించి, కార్బన్ డయాక్సైడును తొలగిస్తాయి. సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ఎంఫిసెమా ఉన్నవారి ఊపిరితిత్తులు వారి శరీరాలకు తగినంత ఆక్సిజన్ ఇవ్వలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి అవసరమవుతుంది. రెండు ఊపిరితిత్తులను ఒక గ్రహీతకు లేదా ఇద్దరు గ్రహీతలకు వేరు వేరుగ మర్పిడి చేయవచ్చు. చాలా మంది ధూమపానం వలన ఊపిరితిత్తుల దానం చెయలేరని నమ్మకం. అయితే, ఇది నిజం కాదు. ఊపిరితిత్తులు పని తీరును మరియు ఫలితాలను అత్యవసర సేవలో తనిఖీచేసి ఉపయోగించవచ్చు.


మూత్రపిండాలు

మూత్రపిండాల ప్రధాన విధి రక్తం నుండి వచ్చే వ్యర్ధ పదార్ధాలను వడ పట్టడం. ఆహారంలోని వ్వర్థాలు రక్తంలో కలుస్తాయి ఇవి తరువాత మూత్రపిండాల ద్వారా వడపోయబడి, మూత్రం ద్వారా శరీరం నుంచి బయచకు పంపబడతాయి. మూత్రపిండాలు సరిగా రక్తాన్ని వడపోయకపోతే లేదా దెబ్బతిని ఉంటే, రక్తంలో చేరిన వ్యర్థాలు శరీరాన్ని పాడు చేయడం ప్రారంభిస్తాయి. తీవ్రమైన మూత్రపిండ వ్యాది ఉన్న వ్యక్తులకు డయాలసిస్ చేయబడుతుంది. అయితే, అనేకమంది సజీవంగా ఉండడానికి మూత్రపిండ మార్పిడి అవసరం. రెండు మూత్రపిండాలు ఒక గ్రహీతకు లేదా ఇద్దిరు వ్యక్తులకు విడివిడిగా మార్చవచ్చు.

కాలేయం

కాలేయం అనేక విధులు నిర్వహించే ఒక క్లిష్టమైన అంగం. దీని ప్రధాన విధులు పోషకాల (ఉదా: గ్లూకోజ్, విటమిన్లు మరియు కొవ్వులు) సంతులనం కొనసాగించటం, రక్తంగడ్డకట్టడాన్ని నియంత్రించటం మరియు వృధా ఉత్పత్తులు తొలగించటం. మెటాబాలిక్ కాలేయ వ్యాధి, హెపటైటిస్ బి లేదా సి, మరియు పిత్తాశయంలో పుట్టుకతోనే రంధ్రము మూసుకొని ఉండుట వంటి పుట్టుకతో వచ్చిన కాలేయ అవలక్షణాల ప్రజలు అందరు సజీవంగా ఉండడానికి కాలేయం మార్పిడి అవసరం అవవచ్చు. కాలేయం ఒక ప్రత్యేకమైన అంగం అది తిరిగి పెరుగుతుంది. ఒక మధ్య వయసు కాలేయ పరిమాణం తగ్గించి దాన్ని చిన్న పిల్లలకు మార్చితే అది పిల్లలతో పాటు పెరుగుతుంది. ప్రత్యామ్నాయంగా, కాలేయాన్ని విభజించి ఇద్దిరు గ్రహీతలకు మార్పిడి చేయవచ్చు.


క్లోమముక్లోమం రక్తంలోని చక్కెర స్థాయిలను ఇసలెట్ అనే కణాల ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి చేసి నియంత్రిస్తుంది. రకం -1 డయాబెటిస్ ఉన్న వారికి, క్లోమం కొద్దిగా లేదా అసలు ఇన్సులిన్ను ఉత్పత్తి చేయదు, మరియు ఇన్సులిన్ ఇంజెక్షన్లతో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా కష్టం. ప్రస్తుతం, క్లోమం మార్పిడులు ఎక్కువగా మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణమయ్యో టైప్ 1 డయాబెటిస్ కలిగిన వారికి నిర్వహిస్తారు. ఈ కారణంగా, తరచుగా క్లోమం మరియు మూత్రపిండం ఒకే దాతనుంచి తీసుకుంటారు.

దానం చేసే కణజాలం

కంటి కణజాలం

కంటి కణజాల దానంలో కార్నియా మరియు స్క్లేరా మర్పిడికి అనుమతి ఉంది. కార్నియా కంటి రంగు భాగంలో ఉండే స్పష్టమైన కణజాలం. ఇది కాంతిని రెటీనా గుండా అనుమతిస్తుంది. కార్నియా మార్పిడి జన్యు పరంగా, అనారోగ్యం లేదా గాయం వల్ల లేదా పాక్షికంగా లేదా పూర్తిగా గుడ్డివారైనవారికి దృష్టి పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. శ్వేతపటలం కంటి చుట్టూ తెల్లని భాగం. నేత్రపటలం గాయం కారణంగా లేదా క్యాన్సర్ కారణంగా కంటి నుండి తొలగించబడిన వ్యక్తుల అంధత్వానికి నిరోధించడానికి మార్పిడిని నిర్వహిస్తారు.

 


ఎముక

దానం చేసిన ఎముక కణజాలం వ్యాధి లేదా ప్రమాదాల ద్వారా కోల్పోయిన ఎముక స్థానంలో పెట్టవచ్చు. ఇది పగుల్ల చికిత్సకు నడుము మరియు మోకాలు కీళ్ళ మార్పిడి, మరియు పిల్లలు మరియు యువకులు వెన్నెముక (పార్శ్వగూని) యొక్క వంకరను సరి చేయడానికి ఉపయోగిస్తారు. పది మందికి అవసరమైన చికిత్సని ఒకే ఎముక దానంతో చేయవచ్చు.

 



చర్మం

పెద్ద గాయం, చర్మం నాశనం, లేదా తీవ్రంగా కాలిన వారికి మళ్లీ ఆరోగ్యంగా మారటానికి చర్మం దానం అవసరం. చర్మం దానం చేసినప్పుడు, ఎండకు ఎండి నప్పుడు పోయే చర్మం అంత ఒక పలుచని పొరను సేకరిస్తున్నారు. ఇది సాధారణంగా వ్యక్తి వీపు మరియు వారి కాళ్ల వెనుక నుంచి సేకరిస్తున్నారు. సగటున, ముగ్గురు దాతల చర్మం ఒక్క గ్రహీతకు అవసరమవుతుంది.


స్నాయువులుఇవి ఎముకలకు కండరాలను అతికించే కణజాలాలు. స్నాయువు మార్పిడి నరాల గాయంతో లేదా దెబ్బతిన్న కండరాలు పనిచేయటం కొరకు రోగులకు సిఫారసు చేయబడుతుంది. ఇది స్వీకర్త జీవితం మెరుగుపరుస్తుంది మరియు నొప్పి లేకుండా చేస్తుంది.


గుండె కణజాలంగుండె మొత్తం అవయవ దానం చేయవచ్చు అలాగే, గుండె కణజాలం కూడా విడివిడిగా దానం చేయవచ్చు. గుండె కవాటాలు గుండె కణజాలాన్ని ప్రధానంగా పిల్లలకు పుట్టుకతో వచ్చిన లోపాలు సరి చేయడానికి ఉపయోగిస్తారు. పెద్దవారిలో వ్యాధికి గురైన కవాటాల స్థానంలో ఉపయోగిస్తారు.