హల్వా పూరీలు తయారుచేయు విధానం:
కావలసినవి: బొంబాయి రవ్వ-1/2 కేజీ, పంచదార-1/2 కేజీ, నెయ్యి-50 గ్రా, గోధుమ పిండి లేక మైదాపిండి-1/2 కేజీ, నూనె-1/4 కేజీ, ఏలకులు-4, పాలు-2 కప్పులు.
తయారుచేయు విధానం:
1. బొంబాయి రవ్వ దోరగా వేయించుకోవాలి.
2. రవ్వ 1కి 2 నీళ్లు, పాలు కలిపి గిన్నెలో ఎసరు పోసి, కాగిన తరువాత పంచదార, ఏలకులు పొడి వేయాలి.
3. నీళ్లు మరిగిన తరువాత రవ్వ వుండ కట్టకుండా, నీరు పోస్తూ, కలుపుతూ వుండాలి.
4. నెయ్యి వేసి స్టౌపై సన్నని సెగ మీద ఉడికించాలి.
5. చక్కగా మగ్గిన తరువాత దింపి వుంచాలి.
6. మైదా పిండి, పూరీల పిండివలే ముద్దగా చేసి అప్పడాలు చేయాలి.
7. ఒక అప్పడం మీద హల్వా పలుచగా పరిచి, పైన వేరొక అప్పడం వేసి, చివర్లు చేతితో కలపాలి.
8. ఈ పూరీని పెనం మీద నూనె వేసి, ఎర్రగా 2 వైపులా కాల్చాలి.
9. ఇవి 2 రోజుల వరకు నిల్వ వుంటాయి.