రవ్వ పూర్ణాలు తయారీ విధానం:
కావలసినవి: బొంబాయి రవ్వ- 1/2 కేజీ, పంచదార-1/2 కేజీ, నెయ్యి- 100గ్రా., మైదా- 14 కేజీ, నూనె-1/4 కేజీ ఏలకులు- 6, -50 .
తయారుచేయు విధానం:
1. బొంబాయి రవ్వ దోరగా వేయించు కోవాలి.
2. మంద పాటి గిన్నెలో రవ్వపోసి, 1కి 2 చొప్పున నీళ్లు కలపాలి.
3. నీరు కాగినప్పుడు పంచదార, యలకుల పొడి వేసి కలపాలి.
4. నీళ్లు రెండు పొంగులు రానిచ్చి బొంబాయి రవ్వ వుండలు కట్టకుండా కలుపుతూ పోయాలి.
5. సన్నని సెగపై వుంచి ఉడికించాలి.
6. ఉడికిన తరువాత దింపి, చల్లార్చి, చిన్న చిన్న వుండలు చేసి పళ్లెములో వేయాలి.
7. మైదాపిండిలో కొద్దిగా తినేపోడా వేసి, కొద్దిగా బెల్లం తరిగి వేసి, బజ్జీల పిండివలే నీళ్లు పోసి కలపాలి.
8. పిండిలో ఒక్క ఉప్పుగడ్డ వేస్తే రుచిగా వుంటుంది.
9. బాండీలో నూనె కాగనిచ్చి, ఒక్కొక్క వుండను మైదా పిండిలో ముంచి, నూనెలో వేయించాలి.
10. ఇవి రెండు, మూడు రోజుల వరకు నిల్వ వుంటాయి.