గవ్వలు
కావలసినవి: గోధుమపిండి-అరకేజీ, పంచదార లేక బెల్లం-అరకేజీ, నూనె-పావుకేజీ 3
తయారుచేయు విధానం:
1. గోధుమపిండి జల్లించి పూరీపిండివలే ముద్దగా చేయాలి. దీనిని ఒక గంట నానబెట్టి వుంచాలి.
2. ఈ పిండిముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
3. గవ్వల పీటపై ఉండలను గవ్వలుగా తయారు చేయాలి.
4. బెల్లం తరిగి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం పాకం వచ్చేంత వరకు సెగపై వుంచాలి.
5. పాకం వచ్చిన తరువాత గవ్వలను ముందు నూనెలో వేయించి, పాకంలో కలపాలి.
6. పాకం గవ్వలన్నిటికి కలిపేలా, గిన్నెలో కానీ, బేసిన్లో కానీ పోసి ఆరబెట్టాలి.
7. ఆరిపోయిన తరువాత డబ్బాలో మూత పెడితే యివి ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.