ఆయుర్వేదం జీవన సారం
నేటి జీవనశైలిలో ఆయుర్వేద ప్రాధాన్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. ఈ ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని ఎంతోకాలంగా భారతదేశంలో ఆచరిస్తూ ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో అది తన విలువను చాటుకుంది. కోవిడ్-19 కు ఏ విధమైన చికిత్సా అందుబాటులో లేని సమయంలో ఆయుర్వేదం, యోగా మాత్రమే రోగనిరోధక శక్తిని పెంచే సాధనాలని సందేహాలకు అతీతంగా నిరూపించుకున్నాయి. పైగా, ప్రపంచం నలుమూలలా ఉన్న వైద్య నిపుణులు కూడా దీన్ని ఆమోదించారు. కరోనా పట్ల సమర్థంగా వ్యవహరించిన తీరు కారణంగా యావత్ ప్రపంచం భారత్ వైపే చుస్తూ ఉండిపోయింది. ఇప్పుడు ఆధునిక వైద్యులు ఆయుర్వేదం పట్ల తమకున్న చిన్నచూపును సమర్థించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరింత మంద ప్రజలు తమ అనారోగ్యాలకు ఆయుర్వేదం మీద ప్రధానంగా ఆధారపడుతూ ఉండటంతో ఆయుర్వేదం తన సామర్థ్యాన్ని నిలబెట్టుకునే దశకు చేరుకుంది.
దుష్ప్రభావాలు లేని ఆయుర్వేదం
ఏదో రకంగా ఆయుర్వేదం దాదాపు ప్రతి ఇంటికీ చేరుకుంది. ప్రతి భారతీయ కుటుంబంలోనూ అన్ని రకాల ఆయుర్వేద మందులూ ఉండటం ఎవరికైనా సులభంగా కనిపిస్తుంది. అల్లోపతి మందుల వలన దుష్ప్రభావాలు ఉండటం కూడా ఎక్కువమంది ఆయుర్వేదం వైపు చూడటానికి ప్రధాన కారణం. ఈ వైద్య విధానం క్రమంగా మరింత ప్రజాదరణ చూరగొంటోంది. సౌందర్య సాధనాలు మొదలుకొని తినుబండారాల దాకా ప్రజల దైనందిన జీవితాల్లో ఆయుర్వేదం ఒక భాగం కావటం గమనించవచ్చు.
ఆయుర్వేదం విశిష్టత
ఈ ప్రాచీన వైద్య విధానం ధ్యానం, మందులతో చికిత్స సహా దానికున్న వైవిధ్య భరితమైన లక్షణాల కారణంగా ఆధునిక జీవన విధానంలో భాగంగా మారింది.
పర్యాటకం
వత్తిడిని ఎదుర్కోవటానికి మరింత మంది యోగా, ధ్యానం, ఆయుర్వేదం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు కేరళ, కర్నాతక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఉతరాఖండే టి ప్రదేశాలు ఆయుర్వేద పర్యాటక కేంద్రాలుగా ప్రసిద్ధమవుతున్నాయ
పంచకర్మ
చెరువులో పూడిక పేరుకున్నట్టే మన దేహంలో విషపదార్థాలు నిల్వ ఉంటున్నాయి. అలాంటి స్థితిలో వాంతులు, నాసిక వస్తి, రకపోటు్త ద్వారా దేహాన్ని పరిశుద్ధం చేయటానికి పంచకర్మ ఒక సమరవంతమైన విధానం.
సౌకర్యాల
ఆయుర్వేదఆస్పత్రులు,మందుల షాపులసంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంది. చివరికి ఆయుర్వేదంలో ఎయిమ్స్ లాంటి వైద్య సంసలుసైతం 2016 నుంచి పరిశోధనలు సాగిస్తున్నాయి.
మార్కెట్
ప్రపంచ మార్కెట్ ఆయుర్వేదం వాటా ౮ కోట్ల డాలర్లు. అది 2050 నాటికి 6 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.
ఆయుర్వేద అద్భుతం
ఆఫనిస్తాన్ కు చెందిన 8ఏళ్ళ మహమ్మద్ మూసా కథ ద్వారా కూడా ఆయుర్వేద ప్రాధాన్యాన్ని అంచనా కట్టవచ్చు. 2015 లో మూసా ఆఫనిస్తాన్ నుంచి వచ్చాడు. అతడిమెడ సొంతగానిలబడటానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఆఫనిస్తాన్ లోనూ, భారత్ లోనూ పెద్దఆస్పత్రులలోయూసఫ్ నైమి ఖరీదైన వైద్యం చేయించటంలో విఫలమైన అతడి తండ్రి ఆయుర్వేదాన్ని నమ్ముకున్నాడు. కనీసం రెండు నిమిషాలపాటు కూడా నిలబడలేని, నడవలేని మూసా కేవలం ఆరు నెలల ఆయుర్వేద చికిత్సతోనే 6 నుంచి 8 నిమిషాలపాటు నడవగలుగుతున్నాడు.
ఆయుర్వేదంలో ఎనిమిది శాఖల
ఆయుర్వేదం, అల్లోపతి పరస్పరం పరిపూరకాలు. అల్లోపతి తక్షణ ఉపశమనం కలిగిస్తే, ఆయుర్వేదం వ్యాధి మూలకారణాన్ని తొలగిస్తుంది. అందులో శస్త్ర చికిత్స మొదలు కాన్సర్ దాకా అన్ని రకాల చికిత్సలూ ఉన్నాయి. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కిందటే ఆయుర్వేదం 8 శాఖలుగా ఉంది. అందులో ఔషధం, శిశుసంరక్షణ, న్యూరాలజీ, శస్త్ర చికిత్స, చెవి-ముక్కు గొంతు, దంతచికిత్స, విషసంబంధ శాస్త్రం, రసాయన ఔషధం, ప్రాచీన ఔషధం ఉన్నాయి. ప్రతిశాఖకూ వివరంగా రాసిన తాళపత్ర గ్రంథాలున్నాయి. అంతే కాకుండా జంతువులకు, మొక్కలకూ విడిగా చికిత్సలున్నాయి. అయితే, ఇంత విస్తృతమైన శాస్త్రం ఇంత కాలం భారతదేశంలో ఎందుకు వెనుకబడిందనే ప్రశ్న వస్తుంది. 11, 12 శతాబ్దాలలో విదేశీ దాడులు దెబ్బతీశాయి. ఆ తరువాత 1835లో బ్రిటిష్ పాలనలో కోల్ కతా లోని ఆయుర్వేద కళాశాలను ఆధునిక వైద్య కళాశాలగా మార్చారు. ఆయుర్వేద వైద్యులకు శిక్షణారాహిత్యం అంటగట్టారు. ఆయుర్వేదాన్ని, యునానీనీ, హోమియోపతిని పక్కనబెట్టి అల్లోపతిని తప్పనిసరిచేస్తూ బ్రిటిషర్లు ఒక చట్టం చేశారు.
యోగా, ఆయుర్వేద ప్రయాణం
స్వాతంత్ర్యం వచ్చిన రెండు దశాబ్దాల తరువాత 1970 లో ఆయుర్వేద, యునాని వైద్యులకు చట్టపరమైన రక్షణ లభించింది. 1995 లో దాన్ని ఒక ప్రత్యేక విభాగంగా మార్చారు. 2003 లో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలో దాని పేరు ఆయుష్ గా మార్చారు. అయితే, 2014 లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్ను ప్రత్యేక మంత్రిత్వశాఖగా విభజించారు. 2014 సెప్టెంబర్ 27న ఆయన ఐక్యరాజ్యసమితిలో యోగా విశిష్టత గురించి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పాటించాలని ఐక్యరాజ్యసమితి 193 సభ్యదేశాల మద్దతుతోఏకగ్రీవంగాఆమోదించింది.మొదటిఅంతర్జాతీయయోగా దినోత్సవం 2015 జూన్ 21 నాడు న్యూ ఢిల్లీరాజ్ పథ్ లో 35,౯౮౫ మంది పాల్గొనటం, 84 దేశాలు యోగాదినోత్సవం పాటించటం గిన్నీస్ బుక్ లో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది.
ఆయుష్మాన్ భారత్
అందరికీఆరోగ్యరక్షణకల్పించేదిశలో ప్రభుత్వం తనదైనముద్రవేస్తూ ప్రపంచంలోనే అతిపెద్దఆరోక్షరక్షణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 50 కోట్లమందికి పైగా ప్రజలు రూ. 5 లక్షల దాకా ఉచిత చికిత్స పొందుతున్నారు.
ఉద్యోగావకాశాలు
రైల్వేల తరువాత ఆరోగ్యరంగమే అతిపెద్ద ఉపాధి వనరుగా మారుతోంది. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిపిఇ కిట్స్ తయారీదారుగా భారత్ మారటమే అందుకు ఉదాహరణ. ఎన్-95 మాస్కుల తయారీలోనూ అదే కథ పునరావృతమవుతోంది.