లివర్ దానం
కిడ్నీ తర్వాత రెండవ అత్యంత సాధారణంగా మార్పిడి చేసే ప్రధాన అవయవం కాలేయం. దీన్ని వలన మనకు కాలేయ వ్యాధి ఈ దేశంలో ఒక సాధారణ మరియు తీవ్రమైన సమస్య అని స్పష్టమవుతుంది. సాంప్రదాయకంగా, కాలేయ మార్పిడి కోసం అవయవాలు వారు లేదా వారి కుటుంబాలు సమ్మతి తెలిపిన తరువాత, మరణించిన దాతల నుండి తీస్తారు. దురదృష్టవశాత్తు, కాలేయ మార్పిడి కోసం వేచి ఉన్న వ్యక్తుల జాబితా పెరుగుతూ ఉంది. చాలినంతగా మరణించిన దాత అవయవాలు అందుబాటులో లేవు. కాలేయ మార్పిడి కోసం వేచి ఉన్న చాలామంది రోగులకు మార్పిడి శస్త్రచికిత్స వారు చాలా జబ్బుపడిన తరువాత మాత్రమే జరుగుతుంది. మరి కొందరు జాబితాలో ఉండగానే మరణించవచ్చు. రోగి కాలేయ భాగం పొందలేకపోతే, అతను లేదా ఆమె మార్పిడి శస్త్రచికిత్స తట్టుకోలేని స్థితికి చేరుకుంటారు. బ్రతికి ఉన్న దాతనుంచి కాలేయ మార్పిడి చేయవచ్చు. ఎందుకంటే కాలేయానికి, శరీరంలో ఏ ఇతర అవయవానికి లేనటువంటి , పునరుత్పత్తి, లేదా పెరుగే సామర్ధ్యం ఉంది. అందువల్ల బ్రతికి ఉన్న దాతతో కాలేయ మార్పిడి సాధ్యమే. కాలేయం రెండు భాగాలు శస్త్రచికిత్స తర్వాత 4 నుండి 8 వారాల వ్యవధిలో పునరుత్పత్తి చెసుకుంటాయి.
ఎవరు జీవించి ఉండి దాత కావచ్చు?
దాత బంధువు, జీవిత భాగస్వామి, లేదా స్నేహితుడు కావచ్చు.
దాత రక్తం గ్రూపు గ్రహీత రక్తం గ్రూపుకు అనుకూలంగా ఉండాలి.
దాత మంచి శారీరక మరియు మానసిక ఆరోగ్యంతో ఉండాలి.
దాత 19-60 సంవత్సరాల మధ్య ఉండాలి.
దీనీలోని ప్రమాదాలను మరియు సమస్యలను మరియు విధానాలను జాగ్రత్తగా అవగాహన చేసుకొన్న తరువాత దాత నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.
ఏ దాతలను వెంటనే అనర్హులుగా పరిగణిస్తారు?
హెపటైటిస్ బి లేదా సి ఉండి ఉంటే
HIV సంక్రమణ
యాక్టివ్ లేదా తరచుగా అధిక మద్యపానం చెస్తే
ప్రస్తుతం మానసిక చికిత్స జరుగుతుంటే
ఇటీవల చరిత్రలో క్యాన్సర్ ఉంటే
ముఖ్యమైన వైద్య పరిస్థితి
వివిధ పరీక్షలు
ముందు పరీక్షలు కాలేయ వ్యాధి తీవ్రతను అంచనా వేసేందుకు ఉపయోగపడతాయి. రోగి మార్పిడికి ముందు క్రింది పరీక్షలు కొన్ని చేయించుకోవచ్చు:
ఉదరం యొక్క CT స్కాన్
కాలేయ అల్ట్రాసౌండ్
ఎలక్ట్రో కార్డియోగ్రాము
డెంటల్ క్లియరెన్స్
స్త్రీ జననేంద్రియ క్లియరెన్స్
స్వచ్చమైన ప్రోటీన్ ఉత్పన్నం (PPD) చర్మం పరీక్ష
దానం చేసిన తరువాత ఉపద్రవాలు
బ్రతికి ఉన్నదాత శస్త్రచికిత్స ప్రధాన కేంద్రంలో జరుగుతుంది. చాలా కొద్ది మంది వ్యక్తులకు శస్త్రచికిత్స సమయంలో లేదా తర్వాత రక్త మార్పిడి అవసరం అవుతుంది. దాతల మరణ సంభావ్య 0.5 నుంచి 1.0 శాతం అవకాశం ఉంటుంది అని తెలుసి ఉండాలి. కాలేయ దానంలో ఇతర ప్రమాదాలు ఏంటంటే రక్తస్రావం, సంక్రమణ, బాధాకరమైన కోత, రక్తం గడ్డకట్టే అవకాశం మరియు కోలుకోవడానికి దీర్ఘకాలం. చాలా మంది దాతలు 2-3 నెలల్లో పూర్తి గా కోలుకుంటారు.
జీవించిఉన్న దాత కాలేయ మార్పిడి ప్రయోజనాలు ఏమిటి?
ప్రధాన ప్రయోజనం గ్రహీతకు వేచి ఉండే సమయం తగ్గుతుంది. రోగ నిర్ధారణ, స్థితి, రక్తం టైపు మరియు పరిమాణం మీద ఆధారపడి, రోగి నెలలు లేదా సంవత్సరాలు వేచిఉండాలి. కొందరు రోగులు సమస్యలు పెరిగి మరణించిన దాత అవయం కోసం వేచి ఉన్న సమయంలో మరణించవచ్చు