గోధుమ హల్వా తయారుచేయు విధానం:
కావలసినవి: గోధుమలు-పావుకేజీ, బెల్లం-పావుకేజీ, ఏలకులు-4, జీడిపప్పు-10, కిస్మిస్-10, నెయ్యి లేక డాల్డా-50 గ్రా., మిఠాయి రంగు-అరస్పూను.
తయారుచేయు విధానం:
1. ముందుగా గోధుమలు బాగుచేసుకొని, రాత్రిపూటే నీళ్ళలో నానబెట్టాలి. ఇవి ఉదయానికి మెత్తగా నానిపోతాయి. వీటిని బాగా రుబ్బి, పలుచని గుడ్డలో కట్టి, గట్టిగా పిండి పాలు తీయాలి. అరలీటరు పాలు తీయాలి.
2. ఈ పాలలో ఏలకులపొడి, మిఠాయి రంగు వేసి కలిపి పొయ్యిమీద ఉంచి సన్నని సెగపై అడుగంటకుండా కలుపుతూ వుండాలి.
3. బెల్లాం తరిగి, కొద్దిగా నీళ్ళుపోసి ముదురు పాకం వచ్చేంత వరకు సెగపై ఉంచి, తరువాత గోధుమ పాలు పోసి ఉండకట్టకుండా, అడగంటకుండా కలుపుతూ వుడాలి.
4. జీడిపప్పు, కిస్మిస్ వేసి, నెయ్యి కూడా వేయాలి. ఇవి బాగా కలపాలి.
5. పళ్ళెములో నెయ్యి రాసి, ఈ హల్వా పోసి, పళ్ళెం అంతా సర్దాలి. చల్లారిన దరువాత ముక్కలుగా కోసుకోవాలి.