కాలేయ వ్యాధులకు హోమియో వైద్యం
శరీరంలోకెల్లా అత్యంత ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి. జీర్ణక్రియల నిర్వర్తనలోనే కాకుండా, రక్తశుధ్ధి ప్రక్రియలోనూ శరీరానికి కావలసిన శక్తినివ్వడంలోనూ కాలేయం ప్రముఖ పాత్ర వహిస్తుంది. జీర్ణవ్యవస్థకు ఇది తోబుట్టువు లాంటిది. వాస్తవానికి జీర్ణక్రియ పేగుల్లోనే జరుగుతుంది. అయితే జీర్ణమైన ఆ ఆహారాన్ని శరీర కణాలు యథాతథంగా తీసుకోలేవు. అందుకే వాటిని శరీర కణాలు సంగ్రహించేందుకు అనువుగా ఆహారాన్ని మార్చేందుకు కాలేయం తన విధులు నిర్వహిస్తుంది. కాలేయ కణాలను హెపాటాసైట్ అంటారు. ఇవి శక్తి- సమతుల్యతను క్రమబద్ధీకరించటంలో పాటు.....
- రోగ కారక క్రిములతో పోరాడటం....
- హానికారక విషపదార్థాలను శరీరం నుంచి వేరు చేయడం
- జీర్ణ ప్రక్రియకు అవసరమయ్యే పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడం
- రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే క్లాటింగ్ ఫ్యాక్టర్లను తయారు చేయడం
- పోషక పదార్థాలను, విటమిన్లను నిలువచేయడం వంటి పనులతో పాటు
- ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు, క్లిష్ట కార్బోహైడ్రేట్ల తయారీలో...
- గ్లూకోజ్ , కొలెసా్ట్రల్ వినియోగంలో, వ్యర్థ పదార్థాల విసర్జనలో కీలక పాత్ర వహిస్తుంది.
కాలేయ వ్యాధికారణాలు
కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, ముఖ్యంగా హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ అనే వైర్‌సలు, దీర్ఘకాలికంగా, అధిక మోతాదులో వాడే మందులు, కొన్ని రసాయనిక పదార్థాలు, కాలేయ వ్యాధులకు కారణమవుతాయి. వీటితో పాటు దీర్ఘకాలికంగా, అధిక మోతాదులో ఆల్కహాల్ తీసుకునే అలవాటు, వంశపారంపర్యంగా వచ్చే హీమోక్రోమటోసిస్ వంటి సమస్యలు, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం వంటివి కూడా కాలేయ వ్యాధికి దారి తీస్తాయి. మిగతా శరీర భాగాలకు మల్లే కాలేయానికి కూడా కేన్సర్ రావచ్చు.
సిరోసిస్ సమస్య....
ఏ వ్యాధి కారణంగానో కాలేయ కణాలు నష్టపోయినప్పుడు సహజంగానే కొత్త కణాలు పుట్టుకొస్తాయి. అయితే కొత్తగా ఏర్పడిన ఈ కణాలు మునుపటి సహజ కాలేయ కణాల్లా శక్తివంతంగా పనిచేయలేవు. పైగా, కాలేయానికి వచ్చే రక్తప్రసరణలో ఆటంకంగా కూడా మారతాయి. ఈ స్థితినే సిరోసిస్ అఒంటారు.
సిరోసిన్ లక్షణాలు
ప్రాధమిక స్థితిలో వ్యాధి లక్షణాలేవీ కనిపించకపోవచ్చు. కానీ, ఆ మలిదశలో నీరసం, నిస్సత్తువ, ఆకలి తగ్గడం, జీర్ణశక్తి తగ్గుదల, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సిరోసిస్ వ్యాధి పెరుగుతున్న క్రమంలో, ప్రతి చిన్న కారణానికే రక్తస్రావం కావడం, ముక్కునుంచి రక్తం కారడం, కాళ్లవాపు, వంటి లక్షణాలు కనిపిస్తాయి. సహజంగా కాలేయం శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటికి పంపిస్తుంది. అయితే, కాలేయం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ప్రక్రియ జరగదు. ఫలితంగా వ్యర్థపదార్థాలు రక్తం ద్వారా అన్ని అవయవాలకు చే రడంతో వాటి పనితనం కుంటుపడుతుంది. ఈ కారణంగా రోగి అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఏమైనా సమస్య ప్రారంభంలోనే సరియైున వైద్య చికిత్సలు తీసుకోకపోతే సిరోసిస్ తీవ్రమై ప్రాణాపాయ స్థితికి కూడా చేరవచ్చు. కాలేయ మార్పిడి చేయాలన్నా, అది దొరకడం కష్టం. దొరికినా ఆ సర్జరీ విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు.
హోమియో వైద్యం..
కాలేయం పనితీరును మెరుగుపరిచే అద్భుతమైన మందులు హోమియోపతిలో మాత్రమే ఉన్నాయి. దుష్ప్రభావాలకు ఏ మాత్రం తావు లేకుండా, సహజ భౌతిక సూత్రాలకు లోబడి ఈ మందులు పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు రోగి శారీరక, మానసిక తత్వాలను పరిగణలోకి తీసుకుని ఇక్కడ చికిత్సలు ఉంటాయి. కాలేయ వ్యాధి చికిత్సలో ఉపయోగపడే కొన్ని ప్రధాన హోమియో మందుల్లో ఆరంమెట్, కాల్కేరియా అర్స్, కార్డస్ యార్, బెలిడోనియం వంటివి ముఖ్యమైనవి. కాకపోతే వీటిని నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక
ఆధారము: ఆంధ్రజ్యోతి