సమస్యలు.. సవాళ్లు..
మీప బంధువుల విషయంలో అవయవ దానం మరియు మార్పిడి విధానం
సమీప బంధువులు కానటువంటి వారినుంచి అవయవదానం మరియు మార్పిడి విధానం
విదేశీయుల విషయంలో ఆవయవ దానం మరియు మార్పిడి విధాన
మెడికో లీగల్ కేసుల్లో అవయవాలు మరియు కణజాల దాన విధానము
ఆధికార సంఘ నిర్ణయం
మీప బంధువుల విషయంలో అవయవ దానం మరియు మార్పిడి విధానం
జన్యుపరంగా సమీప బంధువుల మధ్య అవయవాల మార్పిడి, వారు, అమ్మమ్మ, తాత, తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి, కుమారుడు, కూతురు, మనవడు, మనవరాలు, పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఉంటుందో దానిని రూలు 2 (సి)లో నిర్వచించిన సమర్థాధికారి లేదా ఆథరైజేషన్ కమిటీ (దాత లేదా గ్రహీతలలో ఒకరు విదేశీయుడు అయిన సందర్భంలో) మూల్యాంకణం చేస్తారు;
బంధుత్వానికి సంబంధించిన పత్రాలు: జనన ధృవీకరణ, వివాహ సర్టిపికేట్లు, ఇతర బంధుత్వానికి సంబంధించిన పత్రాలను తహసిల్దార్ లేదా ఉప డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదా పంచాయితీ నుండి లేదా అలాంటి గుర్తింపు పత్రాలు అంటే ఓటర్లు ఫోటో గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు.
ప్రతిపాదిత దాత యొక్క గుర్తింపు మరియు నివాస పత్రాలు: రేషన్ కార్డు లేదా ఓటర్లు గుర్తింపు కార్డు లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాన్ కార్డు లేదా బ్యాంకు ఖాతా మరియు ప్రతిపాదిత దాత మరియు సమీప బంధువుతో పాటు ప్రతిపాదిత గ్రహీత కలిగిన కుటుంబం ఛాయాచిత్రం , లేదా ఇలాంటి ఇతర గుర్తింపు ధృవపత్రాలు అంటే ఆధార్ కార్డ్ (భారతదేశం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ జారీచేసినది).
సాక్ష్యం మూల్యాంకనం తర్వాత సంబంధం నిష్కర్షగా నిర్ధారణ కాకపోతే సమర్థ అధికారి విచక్షణతో ఇతర వైద్య పరీక్షలు, అంటే డియోక్సిరిబౌన్స్లెయిక్ యాసిడ్ (DNA) ప్రొఫైలింగ్ లాంటివి చేయించవచ్చు.
ఉప రూలు (2) లో సూచించిన జాతీయ అక్రిడిటేషన్ బోర్డు మరియు కాలిబరేషను లాబొరేటరీలలోనే పరీక్షలు నిరవహించాలి మరియు సర్టిఫికేట్ ఫా 5 లో ఇవ్వాలి.
డాక్యుమెంటరీ ఆధారాలు మరియు పరీక్ష ఉప-నియమాలు (1) మరియు (2), దాత గ్రహీతలకు మధ్య జన్యుపరమైన సంబంధాన్ని చూపలేకపోతే, అదే విధానాన్ని తలితండ్రులలో ఒకరికి చేయాలి. తల్లిదండ్రులు అందుబాటులో లేకపోతే, అదే విధానాన్ని దాత మరియు గ్రహీత బంధువులకు జరపాలి. ఇది కూడా విఫలమైతే దాత గ్రహీతకు మధ్య జన్యుపరమైన సంబంధాన్ని (మానవ అవయవాలు మార్పిడి ప్రకారం (సవరణ) చట్టం, 2011) ఏర్పాటు కాలేదు అని నిర్ణయిస్తారు.
ప్రతిపాదిత మార్పిడి ఒక వివాహిత జంట మధ్య అయితే, సమర్థనాధికారి లేదా ఆథరైజేషన్ కమిటీ (సందర్భంలో దాత లేదా గ్రహీత లో ఒక విదేశీయుడు) వివాహాం జరిగిన కాలావధి, సంబంధిచిన వివాహ ధ్రువీకరణ, వివాహం ఛాయాచిత్రాలను రికార్డులకోసం ఉంచాలి. దానితో పాటు పిల్లల సంఖ్య మరియు వారి వయస్సు సమాచారం మరియు కుటుంబం మొతం కనిపించే ఛాయాచిత్రం, తలి తండ్రుల సమాచారం కలిగిన పిల్లల పుట్టిన సర్టిఫికేట్ మరియు (spousal దాత కోసం) ఫాం 6 సర్టిఫికేట్ ఉండాలి.
నివాసం లేదా స్థిర నివాసం, తల్లిదండ్రులకు వివరాల రుజువుకు సంబంధించి ఏదైనా పత్రం పత్రాలు ఫోటోగుర్తింపు ప్రతిపాదికన అందిచాలి. ఈవివరాలో తప్పుడు సమాచారం ఉన్నా లేదా అనుమానం ఇచ్చినా సంబంధిత అధికారి లేదా ఆథరైజేషన్ కమిటీ తన విచక్షణతో ఇతర అలాంటి సమాచారాన్ని లేదా సాక్ష్యం కోరుతారు.
అవయవ మార్పిడి ఆపరేషన్ చేసే జట్టులో భాగంగా ఉన్న వైద్యుడు ఆసుపత్రిలో సమర్థ అధికారిగా ఉండకూడదు.
సమర్థ అధికారి విధాన నిర్ణయంలో ఆథరైజేషన్ కమిటీ సహకారము, అవసరమైతే, తీసుకోవచ్చు.
సమీప బంధువులు కానటువంటి వారినుంచి అవయవదానం మరియు మార్పిడి విధానం
ప్రతిపాదిత మార్పిడి దగ్గర బంధువులలో కాకుండా మరియు దాత లేదా గ్రహీత విదేశీయులైన అన్ని సందర్భాలలో (దగ్గరి బంధువు అయినా కాకాపోయినా) ఆమోదాన్ని ఆసుపత్రి ఆథరైజేషన్ కమిటీ ద్వారా లేదా ఆధారిత ఆథరైజేషన్ కమిటీ మంజూరు చేస్తుంది. తర్వాత జిల్లా లేదా రాష్ట్ర స్థాయి ఆథరైజేషన్ కమిటీ ద్వారా ఆమోదాన్ని తీసుకోవాలి.
విదేశీయుల విషయంలో ఆవయవ దానం మరియు మార్పిడి విధానప్రతిపాదిత దాత లేదా గ్రహీత విదేశీయులు అయినప్పుడు;
వారి దేశ సీనియర్ ఎంబసీ అధికారి దాత మరియు గ్రహీతలకు మధ్య సంబంధాన్ని ఫారం 21 రూపంలో ఇవ్వాలి. ఒకవేళ భారతదేశంలో దౌత్య కార్యాలయం లెకపోతే సంబంధిత ప్రభుత్నం సర్టిఫికేట్ జారీ చేయాలి;
భారతీయ సంతతికి చెందిన వారు వీదేశీయులకు అవయవ దానం చెసే విషయంలో ఆథరైజేషన్ కమిటీ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. విదేశీయులకు బతికి ఉన్న భారతీయుని అవయవ దానాన్ని అనుమతించరు.
మెడికో లీగల్ కేసుల్లో అవయవాలు మరియు కణజాల దాన విధానము
అంవయవాలు లేదా కణ జాలాన్ని తొలగించే అధికారం ఉన్నవారు, బ్రెయిన్-స్టెమ్ మరణించిన దాత నుండి అవయవాలను దానానికి సమ్మతి తీసుకొని, నమోదైన వైద్యుడు సమీప పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లేదా సూపరింటిండెంటుకు అభ్యర్థనను పంపాలి. అవయవాలు సకాలంలో తీయడానికి వీలుగా వీరు ప్రత్యక్షంగా లేదా ఆసుపత్రిలో ఉన్న పోలీసు పోస్ట్ ద్వారా పోలీసులకు తెలపవచ్చు. ఈ అభ్యర్థన కాపీని ఆ ప్రాంతంలో నియమించబడిన పోస్ట్ మార్టం డాక్టరుకు కూడా పంపాలి.
అవయవాలు పొందటం కోసం, మరణాన్ని నిర్ణయించటంలో తప్పు చేయకూడదు.
అంగాలు లేదా కణాలు తీసుకోడానికి సంబంధించి వైద్య నివేదికను వైద్యుడు(లు) వెంటనే తయారు చేయాలి. దానిని నమోదిత వైద్యుడు, ఎవరైతే పోస్టుమార్టం చెస్తున్నారో, వారు పోస్టుమార్టం నోట్సు రికార్డులో పొందు పరచాలి.
సాధ్యమైనంత వరకు , నియమించబడిన పోస్ట్ మార్టం నమోదు వైద్యున్ని, కార్యాలయ సమయం దాటినా కూడా, అవయవాన్ని లేదా కణజాలాన్ని తిసే సమయంలో ఉండేట్టు చూడవలసి ఉంటుంది.
ఒక ప్రైవేట్ రీట్రైవల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయక పోతె, వారు శరీరాన్ని వైద్య రికార్డులతో పాటు అవయవం లేదా కణజాలం తీసిన తర్వాత నియమించబడిన పోస్టుమార్టం కేంద్రానికి తీసుకు వాళ్లాలి. పోస్ట్ మార్టం సెంటర్ అలాంటి కేసులను ప్రాధాన్యత ఇచ్చి, కార్యాలయం సమయం దాటినా, పోస్ట్ మార్టం చెయాలి. దాని వల్ల శరీరాన్ని బంధువులకు త్వరగా అప్పగించటానికి వీలవుతుంది.
ఆధికార సంఘ నిర్ణయంఆధికార సంఘం (జీవించిన అవయవ లేదా కణజాల దాత కోసం మాత్రమే వర్తిస్తుంది) అప్లికేషను ఆమోదం లేదా తిరస్కారానికి సంబంధిచిన నిర్ణయాన్ని ఫాం 18 మాదిరగా వ్రాసి తెలయ చేయాలి. అవి అన్నీ క్రింది షరతులకు లోబడి ఉండాలి, అవి:-
ఆమోదం పొందిన ప్రతిపాదిత దాత సంబంధిత దశల్లో అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేసుకోవాలి. దీని వలన అతని లేదా ఆమె అవయవ దానం చేసే జీవ సామర్థ్యాన్ని గుర్తించడానికి వీలవుతుంది;
దాత శారీరక మరియు మానసిక ఆరోగ్య స్థితిని, ఫాం 4 లో, దాత సరైన ఆరోగ్య స్థితిలో ఉన్నారని మరియు మానసిక స్థితి బాగుందిని మరియు వారు అవయవ దానం చేయవచ్చని తెలియ చేయచేసే సర్టిఫికేట్టు ఇవ్వాలి: (దాత యొక్క మానసిక స్థితిపై సందేహం ఉంటే నమోదిత వైద్యుడు లేదా ఆథరైజేషన్ కమిటీ మానసిక వైద్యుడి ద్వారా పరీక్షలు జరపాలి;)
అన్ని నిర్దేశించిన ఫాంలను అవయవ మార్పిడి ప్రక్రియకు సంబంధిత అందరు వ్యక్తులు పూర్తిచేయాలి;
అన్ని ఇంటర్వ్యూలను వీడియో రికార్డ్ చేయాలి.
రోగికి అత్యవసర ప్రాతిపదికన మార్పిడి అవసరం అయ్యే అన్ని సందర్భాలలో అధికార కమిటీ న్యాయ విచక్షణను వాడుతూ తన నిర్ణయాన్ని వేగంగా ఇవ్వాలి.
ప్రతి అధికార మార్పిడి కేంద్రం దాని సొంత వెబ్ సైటును కలిగి ఉండాలి మరియు మార్పిడి అనుమతి లేదా తిరస్కరణ విర్ణయాన్నిఅధికార కమిటీ సమావేశం అయిన ఇరవై నాలుగు గంటల్లో తుది నిర్ణయం తీసుకోవాలి.
ఆథరైజేషన్ కమిటీ నిర్ణయం వెంటనే ఆసుపత్రి లేదా ఇంస్టిట్యూషన్ నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. గ్రహీత మరియ దాతల గుర్తింపును దాచుతూ, కమిటీ నిర్ణయం తీసుకొన్న ఇరవై నాలుగు గంటల్లో, ఆసుపత్రి లేదా ఇన్స్టిట్యూషన్ యొక్క వెబ్ సైట్ లో ఉంచాలి.
మూలం: జాతీయ అవయవ & కణజాల మార్పడి సంస్థ