గుల్గులే తయారుచేయు విధానం:
కావలసినవి: మైదాపిండి-రెడున్నర కప్పులు, తినేసోడా-పావు స్పూను, పంచదార-2 కప్పులు, నెయ్యి-వేయించటానికి,
తయారుచేయు విధానం:
1. నీళ్ళు, పంచదార కలిపి పాకం పట్టుకోవాలి. పాకం అవుతుండగా, పైన కొంచెం నిమ్మరసం పిండితే పాకంలోని తుట్టు అంతా పైకి తేరుకొని పాకం శుభ్రంగా వుంటుంది.
2. తీగపాకం వచ్చేటట్లు పట్టాలి.
3. ఒక స్పూను పాకం తీసుకొని అందులో తినేసోడా కలపాలి. బాగా గిలకరించాలి.
4. జల్లించిన మైదాలో సోడా మిక్సర్ వేసి కలిపి, మిగిలిన పాకం కూడా పోస్తూ ముద్దగా కలపాలి.
5. బాగా కలిపిన తరువాత బాగా గిలక్కొట్టాలి.
6. మూకుడులో నెయ్యి పోసి, కాగిన తరువాత ఒక్కొక్క స్పూను పిండి తీసుకొని వేయాలి. అవి పొంగుతాయి. వేరేవైపు తిప్పి రెండు ప్రక్కలా ఎర్రగా వేయించి తీయాలి. నెయ్యి ఓడ్చి తీయాలి.
7. ఇవి వేడిగా సర్వ్ చేయాలి.