దీపావళి మిఠాయి తయారుచేయు విధానం:
* కావలసినవి: గోధుమపిండి-2 కప్పులు, నెయ్యి-1 కప్పు, పంచదార-ఒకటిన్నర కప్పు, కొబ్బరికాయ-ఒకటి, నువ్వుపప్పు-పావుకప్పు, సోపు-1 స్పూను, మిరియపు గింజలు-10, జాజికాయ-ఒకటి, దాల్చినచెక్కలు-2.
తయారుచేయు విధానం:
1. తెల్లనువ్వులు కాసేపు ఎండలో వుంచి, బూరె మూకుడులో కమ్మని వాసన వచ్చేంతవరకు వేయించి, కచ్చాపచ్చాగా పొడుం దంచుకోవాలి.
2. కొబ్బరిచిప్పలను కోరుకోవాలి. కొబ్బరికోరులో అరకప్పు పంచదార వేసి, గిన్నెలో పోసి సన్నని సెగపై ఉడకనివ్వాలి పంచదార పాకం అయ్యి అందులో కొబ్బరి ముద్ద అవుతుంది.
3. జాజీకాయ, దాల్చినచెక్క, మిరియాలు కచ్చాపచ్చాగా వేరు వేరుగా నూరుకొని ఉంచుకోవాలి. ఇవి పొట్లాలుగా కట్టి వుంచుకోవాలి.
4. రెండు కప్పుల గోధుమపిండిలో కొంచెం పేరిన నెయ్యి వేసి, బాగా కలిపి, నీళ్ళు పోస్తూ పూరీ పిండిలాగా కొంచెం గట్టిగా కలపాలి. దీనిని చిన్న చిన్న వుండలుగా చేసి, అప్పడాల పీట మీద పూరీలా వత్తాలి. పల్చగా వత్తిన ఈ పూరీలను దోరగా, విరిగిపోయేటట్లు వేయించాలి.
5. ఈ పూరీలను రోటిలో సన్నని గోధుమరవ్వ మాదిరి దంచాలి.
6. మరో అరకప్పు పంచదారలో కాసిని నీళ్ళు పోసి లేతపాకం పట్టుకొని వుంచుకోవాలి.
7. ఈ నువ్వుల్ని వేరే సీసాలో పోసి మూతపెట్టాలి.
8. మరుసటిరోజు కూడా నువ్వులకి, ఏలకులకి పాకం పోస్తూ తిప్పితే, నాలుగు రోజులు ఈ విధంగా తిప్పితే రోజుకి రెండు, మూడు గంటల చొప్పున నువ్వులకి, ఏలకులకు పైన ముళ్ళులాగా వస్తాయి. ముళ్ళు వచ్చిన తరువాత రోజుకు ఒక స్పూను చొప్పున పాకం వేస్తూ తిప్పాలి.
9. హల్వా బాగా వచ్చిన తరువాత నక్షత్రాలుగా తయారు అవుతాయి. ఇవి విడిగా తీసి వుంచుకోవాలి.
10. ఒక శుభ్రమైన నెయ్యి రాసిన గిన్నెలో పాకం వేసి, ఆ పాకంలో మిఠాయిరంగు కలిపి, ఆ పాకం వేస్తూ హల్వాని సన్నని సెగమీద త్రిప్పాలి.
11. రంగులే కాకుండా, సువాసన కూడా కావాలనుకుంటే ఎవరికి నచ్చిన ఎస్సెన్సు వారు పాకంలో కలిపి, కొంచెం కొంచెంగా వేస్తూ హల్వా తయారు చేసుకోవచ్చును.
12. హల్వా తయారీకి శుభ్రత, ఓపిక చాలా ముఖ్యం.