గోధుమ లడ్డు తయారీవిధానం :
కావలసినవి: గోధుమలు-అరగ్లాసు, పంచదార-1/2 గ్లాసు, ఏలకులు-4, కిస్మిస్-10, పాలు-అరగ్లాసు
తయారుచేయు విధానం:
1. గోధుమలు బాగుచేసి, బాగా చెరిగి, బూరె మూకుడులో వేసి కమ్మని వాసన వచ్చేదాకా దోరగా వేయించాలి.
2. గోధుమలను తిరగలిలో పోసి విసరాలి. పిండి మరీ మెత్తగా కాకుండా మరీ రవ్వగా కాకుడా మధ్యస్థంగా వుండాలి.
3. పంచదార కూడా తిరగలిలో వేసి, మెత్తగా విసురుకోవాలి.
4. ఏలకులు పొడికొట్టి, గోధుమపిండి, పంచదార పొడి కలిపి పాలు పోస్తే చక్కగా ముద్ద అయి లడ్డూ కట్టటం వస్తుంది.
5. ఇవి వారం రోజుల వరకు నిల్వ వుటాయి.