బీహరీ స్వీట్ ఫితా. తయారుచేయు విధానం:
కావలసినవి: బియ్యప్పిండి-1 కేజీ, బెల్లం-1/2 కేజీ, నెయ్యి లేదా డాల్డా, నువ్వులు-2 కప్పులు.
తయారుచేయు విధానం:
1. బియ్యం పిండి, నీరు పోసి పిండిని ముద్దగా కలుపుకోవాలి.
2. బెల్లం మెత్తగా తరిగి, నువ్వులు కలపాలి.
3. కలిపిన బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
4. బియ్యం పిండి ఉండను చిన్నగా పూరీలా వత్తి దానిలో బెల్లంముద్ద ఉంచాలి. చివరలతో దానిని మూసేయాలి.
5. మరుగుతున్న నీళ్ళల్లో వీటిని 10 ని॥ పాటు ఉంచి తీసేయాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.