తయారుచేయు విధానం:
1. గోధుమపిండి కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి.
2. ఎండుకొబ్బరి కోరి వుంచుకోవాలి, కోరినకొబ్బరి, గోధుమపిండి మెత్తగా రోటిలో దంచుకోవాలి.
3. పంచదారలో నీళ్లుపోసి, ముదురుపాకం వచ్చేంత వరకు వుంచాలి.
4. పాకం ముదిరిన తరువాత అందులో పిండి పోసి బాగా కలపాలి. పళ్లానికి నెయ్యి రాసి అందులో పిండి పోసి, డైమండ్ (షేప్) ఆకారంలో ముక్కలు కోసి, ఒక్కొక్క ముక్కపై ఒక్కొక్క జీడిపప్పు పెడితే తింటానికి చాలా రుచిగా వుంటాయి.