baadhushalu simple method of preparation
బాదుషాలు
కావలసినవి: మైదాపిండి-అరకేజీ, వెన్న-100 గ్రా., పంచదార-50 గ్రా., నెయ్యి-అరకేజీ.
తయారుచేయు విధానం:
1. పంచదార పిండివలే దంచాలి. మైదాపిండిలో దంచిన పంచదార వేసి, నీళ్ళు కలుపుతూ ముద్దవలే చేయాలి. ఈ ముద్దను గంటసేపు నానబెట్టాలి.
2. నానిన ముద్దను బాగా మర్దించి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కొక్క ఉండను చపాతీవలె, నెయ్యి రాసి వత్తాలి. మరల చపాతీలాగా మడిచి నెయ్యి రాసి వత్తాలి. ఈ విధంగా 4,5 సార్లు మడిచి వత్తాలి. ఆఖరున చపాతీ చాపవలే చుట్టాలి. అరఅంగుళం ముక్కలుగా చాకుతో కట్ చేయాలి. ఒక్కొక్కముక్క తీస్తే గుండ్రంగా వుంటుంది. ఈ బిళ్ళను మధ్యలో కొద్దిగా అదిమి వుంచాలి.
3. మూకుడులో నెయ్యి కాగిన తరువాత, ఒక్కొక్క బాదుషాను వేయించి తీసుకోవాలి.
4. బాదుషాలు యింకా బాగా తియ్యగా ఉండాలి అనుకొంటే, పంచదార పాకం పట్టి వాటి మీద పోయవచ్చు.