ఈ రోజులలో మరీనా జీవన శైలి, వాతావరణ కాలుష్యం,సరైన పోషక ఆహారము తీసుకోకపోవటం వంటి కారణాలతో వయస్సుతో సబంధమూ లేకుండా ఆడవారు,మగవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు లోను జుట్టు రాలే సమస్యలు వస్తూనే ఉంటాయి. సాదారణముగా జుట్టు టాల్ సమస్య నుండి బయట పడటానికి అనేక రకాల షాంపూలు,నూనెలు వాడుతూ ఉంటాయి. అయినా పెద్దగా ఫలితం కనపడలేదు. కానీ కొన్ని చిట్కాలు ద్వారా ఇటువంటి సమస్య నుండి బయట పడే అవకాశములు ఉన్నాయి. ఇటువంటి సమస్య నుండి బయట పాడటానికి కొబ్బరి నీళ్లు ఎలా సహాయపడతాయో ఇప్పుడు మనము చూద్దాం.
కొబారి నీళ్లు ను తలా మీద మాడు మీద పోసి వృత్తాకారము మోషన్ నో మసాజ్ ను ఒక 10 నిమిషాల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు కొబ్బరి నీళ్లతో మస్సాజ్ చేసుకోవాలి. తరువాత ఒక 20 నిముషాల పాటు వదిలి వేయాలి. తరువాత తేలిక పాటి షాంపుతో తలస్నానము చేయాలి.
ఆపిల్ సీడర్ వెనిగర్,కొబ్బరి నీళ్లు ను కూడా సమన భాగాలుగా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి 10 నిముషాలు తరువాత గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేయాలి.
ఇదే విధముగా వారానికి రెండు సార్లు చేసుకుంటూ ఉండాలి.