1000 Health Tips: ANKURAM MOVIE:YEVARO OKARU YEPUDO APUDUఎవరో ఒకరు ఎపుడో అపుడు

ANKURAM MOVIE:YEVARO OKARU YEPUDO APUDUఎవరో ఒకరు ఎపుడో అపుడు

ఎవరో ఒకరు ఎపుడో అపుడు...
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు...
అటో ఇటో ఎటో వైపు...
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి...
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి...
వెనుక వచ్చువాల్లకు బాట అయినది ... ||ఎవరో ఒకరు||

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా...
అనుకొని కోడి కూత నిదరపోదుగా...
జగాతికి మేలుకొలుపు మానుకోదుగా ...
మొదటి చినుకు సూటిగా దూకి రానిదేయ్...
మబ్బు కొంగు చాటుగా వొదిగి దాగితే...
వాన ధార రాదుగా నేల దారికి...
ప్రానమంటూ లేదుగా బ్రతకటానికి ...||ఎవరో ఒకరు||

చెదరక పోడుగా చిక్కని చీకటి...
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి...
దానికి లెక్క లేదు కలరాతిరీ...
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని...
రెప్ప వెనక ఆపని కంటి నీటిని...
సాగలేక ఆగితే దారి తరుగునా?...
జాలి చూపి తీరమే దరికి చేరునా...?...||ఎవరో ఒకరు||

యుగములు సాగినా నింగిని తాకక ...
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా...
ఓటమి ఒప్పుకుంటూ ఆగిపోదుగా...
ఎంత వేడి ఎందాకా ఒళ్లు మండితే...
అంత వాడి ఆవిరి వెళ్లి చీరదా...
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా..
నల్ల మబ్బు కమ్మితే చల్లబారదా...?...||ఎవరో ఒకరు||