Lemon Turmeric Drink Benefits: సాధారణంగా పసుపు పాలు తాగుతారు దీన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. అయితే, ఉదయం గోరువెచ్చని నీటిలో పసుపు, నిమ్మరసం వేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది. ఇక పసుపులో కర్కూమీన్ ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కలిపి వీటిని తీసుకోవడం వల్ల మంచి హైడ్రేషన్ మన శరీరానికి అందుతుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వేడినీటితో తీసుకోవడం వల్ల త్వరగా శరీరంలో కలిసి ఇమ్యూనిటీని బలపరుస్తుంది.
నిమ్మకాయలో విటమిన్ సీ ఉంటుంది. ఇది కూడా యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు కలిగి ఉంటుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. నిమ్మకాయతో కలిపిన ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల రొంప సమస్యలు సైతం తగ్గిపోతాయి. సీజనల్ జబ్బులు మన దరిచేరకుండా ఉంటాయి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి తగ్గి జీర్ణక్రియ మెరుగు అవుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. పసుపు, నిమ్మరసం కలిపి కలిపి తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది. ఈ డ్రింక్ రెగ్యులర్‌గా మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల నిద్రలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది.
ఇక ఈ గోరువెచ్చని నీటితో తీసుకునే పసుపు, నిమ్మరసం డ్రింక్ వల్ల కాలేయం శుభ్రం చేస్తుంది. మంచి డిటాక్సిఫైయింగ్‌లా పనిచేస్తుంది. ఈ నీరు మన శరీరంలో ఉన్న విషపదార్థాలను బయటకు తరిమేస్తుంది. దీంతో మంచి రిఫ్రెష్మెంట్ కూడా పొందుతారు. ముఖ్యంగా కడుపులో గ్యాస్ సమస్య ఉన్నవారు పాలు తీసుకోకూడదు. అటువంటి వారు నీళ్లలో పసుపు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. దీంతో మంచి ఫలితాలు కనిపిస్తాయి.
ఈ డ్రింక్ తరచూ తీసుకోవడం వల్ల మూడ్ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఈ ఆరోమా మంచి రీఫ్రెష్మెంట్ కూడా అందిస్తుంది. ఇది మీ చర్మానికి ఈవెన్ స్కిన్ టోన్ కూడా ఇస్తుంది. మీరు సహజసిద్ధంగా మెరిసిపోతారు. పసుపు, నిమ్మరసం కలిపి తీసుకుంటే ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. దీంతో మీ ముఖంపై త్వరగా వృద్ధాప్య ఛాయలు కనిపించవు. ముఖంపై ఉండే యాక్నేను కూడా తగ్గించి మీ చర్మం క్లీయర్‌గా కనిపిస్తుంది.
అయితే, మీరు కూడా ఈ డ్రింక్ మీ డైట్‌లో చేర్చుకోవాలంటే ముందుగా వైద్యుల సూచనలు తీసుకోండి. మీకు ఏవైనా వ్యాధులు ఉంటే వారు తీసుకోవాలా? వద్దా? అనేది సూచిస్తారు. మీరు ఒకవేళ మందులు తీసుకన్నట్లయితే సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికంగా పసుపు తీసుకుంటే కడుపులో అజీర్తికి దారితీస్తుంది అందుకే కొద్ది మొత్తంలో తీసుకుంటే మేలు.
No comments:
Post a Comment