వర్షాకాలం..శీతాకాలాల్లో జలుబు..దగ్గు వస్తుంటాయి. వీటిని కొంతమది నిర్లక్ష్యం చేస్తుండడంతో పలు అనారోగ్యాలకు గురవుతుంటారు. జలుబు.. దగ్గు రాగానే వైద్యుడి దగ్గరకు పరుగెత్తడం..సొంత వైద్యం కనబరుస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే జలుబు..దగ్గు నయమవుతాయి.
*మిరియాలు.. వీటిని పొడి చేసి పాలల్లో కలిపి తాగాలి. మిరియాలు పొడిగా చేసి పాలలో వేసి బాగా మరిగించి. ఇలా చేయడం వల్ల దగ్గు తగ్గుతుంది.
* వేడిపాలలో పసుపు వేసుకోని తాగాలి. పసుపు యాంటిబయాటిక్ కూడా. దీనివల్ల మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ పోతుంది.
* జలుబు ఉన్న సమయంలో నీరు తాగవద్దని అనుకుంటుంటారు. కానీ ఇది మంచిది కాదు. ఎక్కువ నీరు తాగడం మంచిది. అది కూడా వేడినీరు అయితే ఇంకా మంచిది. దగ్గు ఉన్న రోజుల్లో చాలా సార్లు గోరువెచ్చటి నీరు తీసుకున్నట్లయితే గొంతులో ఉండే అసౌకర్యం తగ్గుతుంది.
* లవంగాలని పెనంపై వేసి కాస్త కాల్చినట్టుగా చేయాలి. అనంతరం వీటిని చప్పరిస్తూ ఉన్నటయితే దగు నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది.
జలుబు, దగ్గు అనేవి వైరస్‌ల వల్ల కలిగే సాధారణ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లు. వీటి లక్షణాలు కొన్ని రోజుల తర్వాత తేలికగా ప్రారంభమవుతాయి మరియు ఒక వారంలో తగ్గిపోతాయి.
జలుబు, దగ్గు లక్షణాలు:
గొంతు నొప్పి, ముక్కు మూసుకుపోవడం, ముక్కు కారడం, తుమ్ములు, దగ్గు, అలసట, కళ్ళు ఎరుపెక్కడం.
జలుబు, దగ్గుకు చికిత్స:
సాధారణంగా జలుబు లేదా దగ్గుకు చికిత్స చేయవలసిన అవసరం లేదు.
జలుబు నుంచి రిలీఫ్ పొందాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
దగ్గుకు ఇతర కారణాలు: ఆస్తమా, యాసిడ్ రిఫ్లక్స్, ఫ్లూ, న్యుమోనియా.
4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు జలుబు, దగ్గు మందులు ఇవ్వకూడదు. 4 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు మందులు ఇవ్వాలంటే వైద్యుడిని సంప్రదించాలి.
No comments:
Post a Comment