షాలోట్స్.. ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండదు. కానీ, వీటిని వాడే ఉంటారు. అవేంటంటే అచ్చం ఉల్లిపాయల్లానే ఉంటాయి. కానీ, పొడుగ్గా ఉంటాయి. ఇవి, ఉల్లి కంటే మంచివా తెలుసుకోండి.

మార్కెట్లో అప్పుడప్పుడు షాలోట్స్ కనిపిస్తే వాటిని ఉల్లిపాయల్ని చాలా మంది తెచ్చుకుని వాడతారు. నిజానికీ ఈ రెండింటికి కొన్ని తేడాలున్నాయి. ఉల్లిపాయల్ని మనం రెగ్యులర్‌గా అన్నీ కూరల్లో వేస్తాం. ఇవి ఘాటుగా ఉంటాయి. అయితే, షాలోట్స్ మాత్రం కాస్తా మైల్డ్‌గా తియ్యని రుచితే ఉంటాయి. కొద్దిగా వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటుంది. వీటిని సలాడ్స్, డ్రెస్సింగ్ వంటి వాటికి వాడొచ్చు. మీకు ఘాటు ఎక్కువగా ఉండాలనుకుంటే ఉల్లిపాయల్ని తీసుకోవచ్చు. అదే కాస్తా ఘాటు తక్కువగా ఉండేవాటిని తినాలకుంటే షాలోట్స్ బెస్ట్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ షాలోట్స్ ఉల్లి కుటుంబానికి చెందినదే అయినా చూడ్డానికి గోళాకారంగా ఉల్లిపాయల కంటే చిన్నవిగా ఉంటాయి. వీటిని భూమిలో గుంపులుగా పండిస్తారు. షాలోట్స్‌ని ఫ్రెంచ్ వంటల్లో ఎక్కువగా వాడతారు. ఇక ఉల్లిపాయల్ని మనం అన్నీ కూరల్లోనూ వాడతాం. వీటిని సలాడ్‌లా కూడా తింటాం. పచ్చి ఉల్లిపాయల్ని పెరుగులో నంచుకుని తినేవారు బోలెడు మంది ఉంటారు

కేలరీల విషయానికొస్తే షాలోట్స్‌తో పోలిస్తే ఉల్లిపాయల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల ఉల్లిపాయల్లో 40 కేలరీలు ఉంటాయి. షాలోట్స్‌లో 72 కేలరీలు ఉంటాయి. మీరు కేలరీలను తగ్గించుకోవాలనుకుంటే చక్కగా ఉల్లిపాయలు తినొచ్చు. అయితే, ఉల్లిపాయలతో పోలిస్తే షాలోట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల ఉల్లిపాయల్లో 1.7 గ్రాముల ఫైబర్ ఉంటే, షాలోట్స్‌లో 2. 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ మనకి డైజెషన్‌ని ఇంప్రూవ్ చేసి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీంతో ఎక్కువగా తినరు.

రెండింటిలోనూ ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అయితే, రెండింటిలో షాలోట్స్‌లో విటమిన్ సి కంటెంట్ కాస్తా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరగడం, స్కిన్ మెరుస్తుంటుంది. కాబట్టి, మీరు వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు.

ఉల్లిపాయలు, షాలోట్స్ రెండు కూడా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ని కలిగి ఉంటాయి. ఇవి ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్రెస్ట్ నుంచి కాపాడతాయి. షాలోట్స్ ఆంతోసియానిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఎక్కువగా ఎర్రగా కనిపిస్తాయి. ఇవి యాంటీ క్యాన్సర్ గుణాలని కూడా కలిగి ఉంటాయి. ఉల్లిలో ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గి గుండెకి చాలా మంచిది. ఈ రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్స్ మంచి మోతాదులోనే ఉంటాయి. అయితే, షాలోట్స్‌లో క్యాన్సర్‌తో పోరాడే గుణాలు ఎక్కువగా ఉంటాయి.
No comments:
Post a Comment