పచ్చి పాలు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఆ పాలను మరగబెట్టి టీ లేదా కాఫీ చేసుకున్నకే ఎవరైనా తమ రోజును ప్రారంభిస్తారు. కేవలం తాగడానికి మాత్రమే కాదు అందాన్ని పెంచుకోవడానికి కూడా పాలను ఉపయోగించవచ్చు.
![]() |
MILK |
పచ్చిపాలు అంటే ఏమిటి?
పచ్చిపాలు అంటే గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలు. ఆ పాలను నేరుగా ముఖానికి రాయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. బయట దొరికే పాల ప్యాకెట్లలో ఉండే పాలు... పచ్చిపాలు అనుకుంటారు ఎంతోమంది. కానీ అవి పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురైన తర్వాతే ఆ ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. కాబట్టి అవి పచ్చి పాల జాబితాలోకి రావు. పచ్చిపాలు ముఖానికి రాయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
నేరుగా గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలను తీసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల మీరు కోల్పోయిన మెరుపు తిరిగి చర్మానికి వస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, ఇనుము, మరెన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎక్స్పోలియేటింగ్ ఏజెంట్ లాగా పని చేస్తాయి. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. కాంతివంతమైన ప్రకాశవంతమైన చర్మ రంగును ఇస్తాయి.
జిడ్డు చర్మంకలవారికి
జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారికి పచ్చిపాలు మంచి ఎంపిక అని చెప్పాలి. జిడ్డు చర్మం గలవారి చర్మ రంధ్రాలలో అధిక నూనె దాగి ఉంటుంది. ఈ నూనెను తొలగించి చర్మానికి మెరుపుని ఇచ్చేందుకు పచ్చిపాలు ఉపయోగపడతాయి. ఈ పాలల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి చర్మం కూడా త్వరగా తేమవంతంగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.
కొందరి ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బందికరంగా మారుతాయి. అలాంటివారు పాలను చర్మంపై అప్లై చేయడం ద్వారా ఆ మచ్చలను పోగొట్టుకోవచ్చు. కొందరికి మొటిమలు వచ్చి తగ్గాక నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వాటిని కూడా పచ్చిపాలు తొలగిస్తాయి. పచ్చి పాలలో కొవ్వులు, నీరు, విటమిన్ ఏ, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మృత కణాలను తొలగిస్తాయి. మీ ముఖాన్ని మృదువుగా, తేమవంతంగా చేస్తాయి. సహజమైన మెరుపును చర్మానికి ఇస్తాయి.
మొటిమలు సమస్యకు
ఎవరికైతే మొటిమలు అధికంగా వస్తున్నాయో వారు ఈ పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం అలవాటుగా మార్చుకోండి. విటమిన్ ఏ తో నిండిన ఈ పాలు చర్మ రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఈ పాలు చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి. కాబట్టి మొటిమలు తక్కువగా వస్తాయి.
పచ్చిపాలలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లు చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. వాటికి పోషణను అందిస్తాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన మెరుపును పొందుతుంది.
పచ్చిపాలు పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురికావు. కాబట్టి కొంతమందిలో చర్మ ఇన్ఫెక్షన్లు, చికాకు కలగవచ్చు. అంటే సున్నితమైన చర్మం కలవారికి పచ్చిపాలు పడకపోవచ్చు. కాబట్టి ముందుగా టెస్ట్ చేసుకోండి. మీకు పచ్చిపాలను రాసిన తర్వాత మంటగా, దురదగా అనిపిస్తే మీకు ఆ పాలు పడడం లేదని అర్థం. కాబట్టి అలాంటివారు పచ్చిపాలను వినియోగించవద్దు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
Haritha Chappa
No comments:
Post a Comment