Does eating white bread cause diabetes and obesity?

 ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెడ్ ఆమ్లెడ్, బ్రెడ్ పకోడా, బ్రెడ్ జామ్ రకరకాలు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నారు. అయితే, ఓ యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం వస్తుందని పేర్కొన్నారు. ఇందులో నిజనిజాలు తెలుకోవడానికి నిపుణుల్ని సంప్రదించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే..







ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక, మనం తినే ఆహారం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి హాని కలిగించే ఫుడ్స్ కూడా ఉన్నాయి. అందుకే తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తింటే కచ్చితంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. ఇక, ఈ రోజుల్లో డయాబెటిస్, ఊబకాయం సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి.

ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వైట్ బ్రెడ్‌ని తింటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగోలేనప్పుడు చాలా మంది వైట్ బ్రెడ్ తెచ్చుకుని పాలతో కలిపి తీసుకుంటున్నారు. అయితే, వైడ్ బ్రెడ్‌ తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది వైడ్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, వైడ్ బ్రెడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం వస్తాయని ఓ యూట్యూబ్ వీడియోలో ఉంది. ఇందులో నిజం తెలుసుకోవడానికి మా ఫ్యాక్ట్ చెక్ బృందం నిపుణుల్ని సంప్రదించింది. ఈ విషయంపై నిపుణులు ఏం చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.



యూట్యూబ్ వీడియోలో వైట్ బ్రెడ్ తినడం ఆరోగ్యానికి ప్రమాదమని తెలిపారు. వైడ్ బ్రెడ్‌ని 100 శాతం మైదాతో తయారు చేస్తారని.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. వీటిని తినడం వల్ల డయాబెటిస్, ఊబకాయం ముప్పు పెరుగుతుందని తెలిపారు. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ లేదంటే ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి ఇంటి టిఫెన్స్ చేయడం మేలని పేర్కొన్నారు. అంతేకానీ వైడ్ బ్రెడ్‌తో పకోడా, జామ్‌తో తినడం, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తినవద్దని తెలిపారు. అయితే, ఇందులో నిజమెంత? డాక్టర్ ఏం చెప్పారు?

డాక్టర్ ఏం చెప్పారంటే..
యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం నిజమో లేదో తెలుసుకోవడానికి ది డైట్ ఎక్స్‌పర్ట్స్‌ సీఈవో, హెడ్ డైటీషియన్ అయిన సిమ్రమ్ కతురియాను సంప్రదించడం జరిగింది. వైట్ బ్రెడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయని.. ఇందులో పోషకాలేమీ లేవని సిమ్రమ్ కతురియా తెలిపారు. వైట్ బ్రెడ్‌లో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిల్లో ఆకస్మిక మార్పులకు కారణమన్నారు.

వైట్ బ్రెడ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ తగ్గుతుంది. దీంతో టైప్ -2 డయాబెటిస్ వస్తుందని తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆకలి పెరుగుతుందని.. దీంతో కొవ్వు స్థాయిలు పెరిగి ఊబకాయం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు.


చివరికి ఏం తేలిందంటే..మా ఫ్యాక్ట్ చెక్ విచారణలో యూట్యూబ్ వీడియోలో ఉన్న సమాచారం దాదాపు నిజమని తేలింది. వైట్ బ్రెడ్ వల్ల ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు తెలిపారు. వైడ్ బ్రెడ్ బదులు గింజలు, తృణధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆహారంలో చేర్చుకోవాలని వారు పేర్కోన్నారు.





Check for paralysis. helth tips

 పక్షవాతానికి చెక్!

పక్షవాతం వస్తే ఎంత నరకమో తెలిసిందే! మంచానికే పరిమితమై ఇతరులపై ఆధారపడి జీవనం సాగించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తలతో పక్షవాతం రాకుండా చూసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఇందుకోసం వారు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజూ శరీరానికి సరిపడా మెగ్నీషియం తీసుకుంటే పక్షవాతం దరిచేరదట. අධි ఆషామాషీగా చెప్పింది కాదు. పరిశోధనల్లో వెల్లడయిన విషయం ఇది. మెగ్నీషియం సమృద్ధిగా లభించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే వారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూడటం ద్వారా పక్షవాతం ముప్పు తగ్గిపోతుందని పరిశోధకులు గుర్తించారు. ఆహారం ద్వారా తీసుకునే మెగ్నీషియం 100 మి.గ్రా మోతాదు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు తొమ్మిది శాతం తగ్గుతున్నట్లు కనుగొన్నారు. పొట్టు తీయని ధాన్యాలు, పాలకూర, తోటకూర, బీన్స్, బాదం, జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది.

Does eating nepaka on a regular basis reduce inflammation of the gums?:పరగడపున వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందా, డాక్టర్స్ చెప్పే నిజాలు తెలుసుకోండి

 వేపాకుల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఈ నేపత్యంలోనే వేపాకులు తింటే చిగురువాపు తగ్గుతుందని ఓ వార్త హల్ చల్ అవుతోంది. ఇందులో నిజమెంతో తెలుసుకోండి.







దంతాలు, చిగుళ్ల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్నే కాపాడుతుంది. దంతాల ఆరోగ్యం బాగుంటే చిగుళ్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకూ దరిచేరవనే చెప్పొచ్చు. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలకి పరిష్కారంగా సోషల్ మీడియాలో చాలా నివారణలు ఉన్నాయి. వీటిలో ఒకటే.. ఉదయం పరగడపున వేపాకులు తినడం. ఇలా వేపాకులు తింటే చిగుళ్ల ఆరోగ్యం మెరుగ్గా మారుతుందని యూట్యూబ్‌లో ఓ వీడియోలో చెబుతున్నారు. ఇందులో నిజాలు తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ టీమ్ డాక్టర్‌ని సంప్రదించారు.

డాక్టర్ చెప్పేదేంటంటే

వేపాకులు తింటే చిగుళ్ల వాపు తగ్గుతుందన్న టిప్ గురించి డా.కరుణ మల్హోత్రా, కాస్మోటాలజిస్ట్ మాట్లాడుతూ వేపాకులు సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, క్రిమినాశక లక్షణాల కారణంగా చిగుళ్ల ఆరోగ్యానికి కొన్ని రోజులుగా వాడుతున్నారు. దీనిని వాడడం వల్ల చిగురు వాపు తగ్గుతుంది. కానీ, చిగుళ్లు, దంతాలకు సంబంధించిన సమస్యల్ని వేపాకులు పూర్తిగా హెల్ప్ చేస్తాయనేది నిజం కాదని చెబుతున్నారు.


వేప బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీంతో వాపు తగ్గుతుంది. కానీ, చిగురువాపు అనేది పాచి, ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వంటి కారణాల వల్ల వస్తుంది. ఇలాంటి వాటిని త్వరగా గుర్తించి ట్రీట్‌మెంట్ చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. దీనికోసం వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటితో నోటిని క్లీన్ చేయడం, వేపనూనె రాయడం వల్ల కాస్తా రిలాక్స్ ఉంటుంది. కానీ, ట్రీట్‌మెంట్ చేయకపోవడం సరికాదు. కచ్చితంగా ట్రీట్‌మెంట్ చేసుకుంటే సమస్య తగ్గుతుందని డాక్టర్ చెబుతున్నారు


దంతాలు, చిగుళ్ల రక్షణలో వేపాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ, ఇది డాక్టర్ ట్రీట్‌మెంట్ బదులు చేయడం సరికాదు. దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రొఫెషనల్ చెకప్స్, ట్రీట్‌మెంట్ ముఖ్యమైన డాక్టర్ కరుణ చెబుతున్నారు. ఇలాంటి చిగుళ్ల, దంత సమస్యలకి కేవలం వేపాకులు మాత్రమే పరిష్కారమని భావించొద్దొని డాక్టర్ చెబుతున్నారు.

ఇలాంటి వార్తల్ని నమ్మే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. వేపాకులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, అవే ట్రీట్‌మెంట్‌లా వాడొద్దు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్న సమయంలో ఇలాంటివి నమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. లేదంటే చాలా సమస్యలొస్తాయి. ఇక పరగడపున వేపాకుల్ని తీసుకుంటే చిగుళ్ల వాపు పూర్తిగా తగ్గుతుందనే వార్తలు నిజం కాదు. కానీ, దాని వల్ల రిలీఫ్ ఉంటుంది. కాబట్టి, ఇలాంటి విషయాల్లో కాస్తా జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఏ వార్తలైనా సరే నమ్మే ముందు డాక్టర్స్, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Breathing Exercises Benefits Helth Tips

Breathing Exercises Benefits: లోతైన శ్వాస వ్యాయామాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.













Breathing Exercises Benefits: మెదడులోని శ్వాసకోశ కేంద్రం మన శ్వాసను నియంత్రిస్తుంది, ఇది స్వయం చాలక శారీరక చర్య. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు సంభవించే.. "ఫైట్-ఆర్-ఫ్లైట్ స్పందన" మన శ్వాస విధానాలు, రేట్లలో మార్పులకు కారణం అవుతుంది. అదృష్టవశాత్తూ, మనం శ్వాసించే విధానాన్ని మార్చే సామర్థ్యం మనకు ఉంది. శ్వాస వ్యాయామాలు ఒత్తడి, దానితో సంబంధం ఉన్న అరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి.. సహాయపడతాయని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. ధ్యానం, యోగా, తాయ్‌ చిలలో అనేక రకాలుగా.. శ్వాసను నియంత్రిస్తూ ఉంటారు. చాలామంది లోతైన శ్వాస వ్యాయామాలు.. ఒత్తిడిని తగ్గించడానికి, విశ్రాంతిని పెంపొందించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక రకాల, ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టడానికీ లోతైన శ్వాస వ్యాయమాలు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది..

శ్వాస వ్యాయామాలు రోజూ ప్రాక్టిస్‌ చేస్తే.. ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గించే సామర్థ్యం ఉందని నిపుణులు అంటున్నారు. డీప్‌ బ్రీత్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థను యాక్టివ్‌ చేస్తాయి. ఇవి శరీరం, మనస్సును శాంతపరచడానికి సహాయపడతాయి


ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుంది..

శ్వాస వ్యాయామాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి, శరీరానికి ఆక్సిజన్ డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తోడ్పడతాయి. ఇది మొత్తం శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది..

లోతైన శ్వాస వ్యాయమాలు.. ఒత్తిడిని తగ్గిస్తాయి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి తోడ్పడతాయి. తద్వారా రక్తపోటు స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఇది గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


శక్తి స్థాయిలు పెంచుతుంది..

లోతైన శ్వాస వ్యాయామాలు.. శరీరానికి ఆక్సిజన్‌ ప్రవాహాన్ని పెంచుతాయి. తద్వారా శరీర శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. లోతైన శ్వాస వ్యాయామాలు.. అలసటను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. మొత్తం శక్తిని మెరుగుపరచడానికి సహాయపడతాయి.


దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి..

లోతైన శ్వాసవ్యాయామాలు.. మైండ్‌ఫుల్‌నెస్‌ను ప్రోత్సహిస్తాయి, మనస్సును నిశ్చలంగా ఉంచుతాయి. తద్వారా శ్వాస వ్యాయామాలు దృష్టిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయి. మానసిక స్పష్టత, శ్రద్ధ అవసరమయ్యే.. పనులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.


రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది..

లోతైన శ్వాసవ్యాయమాలు.. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడానికి తోడ్పడతాయి, తెల్ల రక్తకణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇవి రోగనిరోధక ప్రతిస్పపందనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.


జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది..

లోతైన శ్వాసవ్యాయామాలు పారాసింపథెటిక్‌ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇది విశ్రాంతి, జీర్ణక్రియకు బాధ్యత వహిస్తుంది. లోతైన శ్వాస వ్యాయామాలు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది, ఇది మెరుగైన గట్‌ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.


కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది..

శ్వాస వ్యాయామాలు కండరాల విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి, శరీరంలో ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడతాయి. దీర్ఘకాలిక నొప్పి, కండరాల దృఢత్వంతో బాధపడేవారికి లోతైన శ్వాసవ్యాయామాలు సహాయపడతాయి.


నిద్రను మెరుగుపరుస్తాయి..

లోతైన శ్వాసవ్యాయామాలు విశ్రాంతిని ప్రోత్సహిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. లోతైన శ్వాస వ్యాయామాలు నిద్రవేళకు ముందు మనస్సు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి తోడ్పడతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Fatigue, nail discoloration Helth tips

 అలసట, గోళ్ల రంగులో మార్పు

nail discoloration

చిన్న చిన్న పనులకే అలసిపోతున్నారా? గత కొన్ని రోజుల నుంచి అలసటతో బాధపడుతున్నారా అయితే, ఈ లక్షణాలు కూడా లివర్ ప్రమాదంలో పడిందని సూచించేవే. అంతేకాకుండా చేతి గోళ్లు లేదా కాళ్ల గోళ్లు కూడా రంగు మారుతాయి. గోళ్ల మీద తెలుపు రంగు మ‌చ్చ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. లేదా గోళ్లు ప‌సుపు రంగులో కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఒంటి నొప్పులు, నడిచేటప్పుడు అసౌకర్యంగా ఉంటే వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి.

Green jaundice or jaundice

 పచ్చ కామెర్లు లేదా జాండిస్

green jaundice


కళ్లు, చర్మం పచ్చ రంగులో మారడం పచ్చ కామెర్లు లక్షణాలు. ఈ సంకేతాలు పదే పదే మీకు కనిపిస్తే లివర్ ప్రమాదంలో పడిందని అర్థం చేసుకోండి. పచ్చ కామెర్లు రావడం కాలేయ సమస్యల్ని సూచిస్తుంది. పచ్చ కామెర్లు లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడే అవకాసం ఉంది.

Water accumulates in the organs. Due to this.. some parts of the body are subject to swelling. Swelling especially in the legs and feet

 Water accumulates in the organs. Due to this.. some parts of the body are subject to swelling. Swelling especially in the legs and feet


Leg Pains

Leg Pains : కాలేయ పనితీరు మెరుగ్గా లేనప్పుడు శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. దీంతో.. చాలా అవయవాల్లో నీరు ఎక్కువగా చేరుతుంది. దీంతో.. శరీరంలోని కొన్ని భాగాలు వాపులకు లోనవుతుంటాయి. ముఖ్యంగా కాళ్లు, పాదాల్లో వాపులు కనిపిస్తాయి. చేతి వేళ్లతో నొక్కితే చర్మం లోపలికి పోతుంది. ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకండి. లివర్ డ్యామేజ్‌ని సూచించే సంకేతం ఇది. అందుకే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోండి.