Beauty Tips with Raw milk: ఇంట్లోనే పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం వల్ల ఈ అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

 పచ్చి పాలు ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఆ పాలను మరగబెట్టి టీ లేదా కాఫీ చేసుకున్నకే ఎవరైనా తమ రోజును ప్రారంభిస్తారు. కేవలం తాగడానికి మాత్రమే కాదు అందాన్ని పెంచుకోవడానికి కూడా పాలను ఉపయోగించవచ్చు.

MILK

కాచి చల్లార్చిన పాలకంటే పచ్చిపాలు చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. పచ్చి పాలను ప్రతిరోజు ముఖానికి అప్లై చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.


పచ్చిపాలు అంటే ఏమిటి?

పచ్చిపాలు అంటే గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలు. ఆ పాలను నేరుగా ముఖానికి రాయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. బయట దొరికే పాల ప్యాకెట్లలో ఉండే పాలు... పచ్చిపాలు అనుకుంటారు ఎంతోమంది. కానీ అవి పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురైన తర్వాతే ఆ ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. కాబట్టి అవి పచ్చి పాల జాబితాలోకి రావు. పచ్చిపాలు ముఖానికి రాయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

నేరుగా గేదె లేదా ఆవు నుంచి తీసిన పాలను తీసుకొని ముఖానికి అప్లై చేయడం వల్ల మీరు కోల్పోయిన మెరుపు తిరిగి చర్మానికి వస్తుంది. దీనిలో లాక్టిక్ ఆమ్లం, ఇనుము, మరెన్నో ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎక్స్పోలియేటింగ్ ఏజెంట్ లాగా పని చేస్తాయి. చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తాయి. కాంతివంతమైన ప్రకాశవంతమైన చర్మ రంగును ఇస్తాయి.


జిడ్డు చర్మంకలవారికి

జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారికి పచ్చిపాలు మంచి ఎంపిక అని చెప్పాలి. జిడ్డు చర్మం గలవారి చర్మ రంధ్రాలలో అధిక నూనె దాగి ఉంటుంది. ఈ నూనెను తొలగించి చర్మానికి మెరుపుని ఇచ్చేందుకు పచ్చిపాలు ఉపయోగపడతాయి. ఈ పాలల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి చర్మం కూడా త్వరగా తేమవంతంగా మారుతుంది. జిడ్డు తొలగిపోతుంది.

కొందరి ముఖంపై నల్లటి మచ్చలు ఇబ్బందికరంగా మారుతాయి. అలాంటివారు పాలను చర్మంపై అప్లై చేయడం ద్వారా ఆ మచ్చలను పోగొట్టుకోవచ్చు. కొందరికి మొటిమలు వచ్చి తగ్గాక నల్లటి మచ్చలు ఏర్పడతాయి. వాటిని కూడా పచ్చిపాలు తొలగిస్తాయి. పచ్చి పాలలో కొవ్వులు, నీరు, విటమిన్ ఏ, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మృత కణాలను తొలగిస్తాయి. మీ ముఖాన్ని మృదువుగా, తేమవంతంగా చేస్తాయి. సహజమైన మెరుపును చర్మానికి ఇస్తాయి.


మొటిమలు సమస్యకు

ఎవరికైతే మొటిమలు అధికంగా వస్తున్నాయో వారు ఈ పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం అలవాటుగా మార్చుకోండి. విటమిన్ ఏ తో నిండిన ఈ పాలు చర్మ రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. ఈ పాలు చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తాయి. కాబట్టి మొటిమలు తక్కువగా వస్తాయి.

పచ్చిపాలలో ఇనుము అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిలో ఉండే ముఖ్యమైన ప్రోటీన్లు చర్మాన్ని అందంగా కనిపించేలా చేస్తాయి. వాటికి పోషణను అందిస్తాయి. ఈ పాలలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది. సహజమైన మెరుపును పొందుతుంది.

పచ్చిపాలు పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురికావు. కాబట్టి కొంతమందిలో చర్మ ఇన్ఫెక్షన్లు, చికాకు కలగవచ్చు. అంటే సున్నితమైన చర్మం కలవారికి పచ్చిపాలు పడకపోవచ్చు. కాబట్టి ముందుగా టెస్ట్ చేసుకోండి. మీకు పచ్చిపాలను రాసిన తర్వాత మంటగా, దురదగా అనిపిస్తే మీకు ఆ పాలు పడడం లేదని అర్థం. కాబట్టి అలాంటివారు పచ్చిపాలను వినియోగించవద్దు.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)


Haritha Chappa

Those who eat these foods in their 20s will have signs of old age in their 60s.. Be careful!!:ఈ ఫుడ్స్ తిన్నారో 20లో వాళ్లకి 60 ఏళ్ల వృద్ధాప్య లక్షణాలు.. జాగ్రత్త మరి!

Those who eat these foods in their 20s will have signs of old age in their 60s.. Be careful!!:ఈ ఫుడ్స్ తిన్నారో 20లో వాళ్లకి 60 ఏళ్ల వృద్ధాప్య లక్షణాలు.. జాగ్రత్త మరి!

helth tips


కొంతమందికి చిన్న వయస్సు లో  ఉన్నా చూడడానికి చాల పెద్దవారు ల కనిపిస్తారు. ఈ వృద్ధాప్యనికి  లక్షణాలకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాటిల్లో మనం తీసుకునే ఆహారాలు కూడా ఉన్నాయి.

ఇ  ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల వృద్ధాప్య ప్రక్రియ వేగవంతం అవుతుంది . యవ్వనంగా కనిపించకుండా చేస్తాయి. ఈ ఆహారాలు శరీరంలో మంటను పెంచడం, కణాలను దెబ్బతీయడం , వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దారితీయడం వంటి అనేక విధాలుగా పనిచేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను పెంచే కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..


చక్కెర అధికంగా ఉండే ఆహారాలు,పానీయాలు:

చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు , పానీయాలు వృద్ధాప్యానికి ప్రధాన కారణం. చక్కెరలు శరీరంలో గ్లైకేషన్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తాయి. ఈ ప్రక్రియలో చక్కెరలు ప్రోటీన్లతో కలిసిపోయి ఏజీఈలు (అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్) ఏర్పడటానికి కారణమవుతాయి. ఈ ఏజీఈలు చర్మం యొక్క స్థితిస్థాపకతను తగ్గించి, ముడతలు, చర్మం వదులుగా మారడానికి దారితీస్తాయి. అంతేకాకుండా, చక్కెరలు అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయి, ఇది వృద్ధాప్య సంకేతాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఉదాహరణకు, సోడాలు, జ్యూస్‌లు, స్వీట్లు, కేకులు, కుకీలు , ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటివి వృద్ధాప్య లక్షణాలను పెంచుతాయి.

పాలల్లో ఇవి నానబెట్టి తీసుకుంటే ఊహించని శక్తి.. అసలు సంగతి తెలిస్తే!

ప్రాసెస్ చేసిన ఆహారాలు:

ప్రాసెస్ చేసిన ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో ఉప్పు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు , రసాయన సంకలనాలు ఉంటాయి. ఈ ఆహారాలు శరీరంలో మంటను పెంచుతాయి. కణాల నష్టానికి కారణమవుతాయి. ఇవి చర్మం యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి, ముడతలు , ఇతర వృద్ధాప్య సంకేతాలను పెంచుతాయి. ప్రాసెస్ చేసిన మాంసాలు, రెడీ-టు-ఈట్ మీల్స్, చిప్స్, ఫాస్ట్ ఫుడ్ వంటివి వృద్ధాప్య లక్షణాలను వేగవంతం చేసే ఆహారాలలో ముఖ్యమైనవి.

వేయించిన ఆహారాలు:

వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు శరీరంలో మంటను పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. వేయించిన ఆహారాలు ఫ్రీ రాడికల్స్‌ను కూడా ఉత్పత్తి చేస్తాయి, ఇవి కణాలను దెబ్బతీసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, డోనట్స్, ఇతర డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వంటివి వృద్ధాప్య లక్షణాలను పెంచే ఆహారాలకు ఉదాహరణలు.

ఎక్కువగా  ఆల్కహాల్ తీసుకోవడం :

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది, ఇది చర్మాన్ని పొడిగా , ముడతలుగా చేస్తుంది. ఆల్కహాల్ కాలేయానికి కూడా హానికరం, ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది చర్మం , శరీర ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.


శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు:

తెల్ల బియ్యం, మైదా పిండితో చేసిన ఆహారాలు , తెల్ల బ్రెడ్ వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. ఇది గ్లైకేషన్ ప్రక్రియను ప్రేరేపిస్తుంది, వృద్ధాప్య లక్షణాలను పెంచుతుంది. వీటి బదులుగా, తృణధాన్యాలు , సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు.

ట్రాన్స్ ఫ్యాట్స్:

ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేయించిన ఆహారాలు, కొన్ని రకాల మార్గారిన్‌లలో కనిపిస్తాయి. ఇవి శరీరంలో మంటను పెంచుతాయి , గుండె జబ్బులు , ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇవి చర్మం యొక్క స్థితిస్థాపకతను కూడా తగ్గిస్తాయి, ముడతలు, వృద్ధాప్య సంకేతాలను పెంచుతాయి.

వృద్ధాప్య సంకేతాలను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన యవ్వన రూపాన్ని పొందడానికి, ఈ ఆహారాలను వీలైనంత వరకు తగ్గించడం లేదా పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు వంటి పోషకమైన ఆహారాలను తీసుకోవడం వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించడంలో సహాయపడుతుంది.

Lemons: నిమ్మకాయలు నిత్యం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?

 Lemons: నిమ్మకాయలు నిత్యం తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త ?

HelthTips
Lemon
Lemons: తేనెలో నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పులిహోరలో వాడినట్లయితే రుచి చాలా బాగుంటుంది. నిమ్మ పచ్చళ్ళు, వంటకాలు, జ్యూస్ లు ఏది చేసినా చాలా బాగుంటాయి.

ఇందులో విటమిన్ సి, ఆంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడేది. విటమిన్ సి అందించిన వాటిలో నిమ్మ పండు వరసలో ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Health Benefits of Lemon

అంతే కాకుండా ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. నిమ్మకాయలో రాగి, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, ఖనిజాలు అధికంగా ఉంటాయి. దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఆహారంలో ఒక నిమ్మకాయను చేర్చినట్లయితే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు అందుతాయి.

ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది. భోజనం తిన్న వెంటనే నిమ్మకాయ తింటే జీర్ణ క్రియ వేగంగా మెరుగుపడుతుంది. ఇది చర్మానికి కూడా ఎంతో మేలును కలిగిస్తుంది. నిమ్మకాయలో పెక్టిక్ ఉంటుంది. నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే బరువు సులభంగా తగ్గుతారు. ఇందులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

అసలు ఏ ఆరోగ్య సమస్యలున్నవారు బీట్‌రూట్ తినకూడదు. తింటే ఏమవుతుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ప్రెగ్నెంట్స్

pregnancy

​ప్రెగ్నెన్సీ టైమ్‌లో బీట్‌రూట్ తినడం మంచిది. అయితే, ఎక్కువ మాత్రం తినకూడదు. తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలని గుర్తుంచుకోవాలి. డాక్టర్ సలహాతో ఎంత మోతాదులో తినొచ్చో తెలుసుకుని అంతే పరిమాణంలో తీసుకోవాలి. ముఖ్యంగా దీనిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో నీరసం, తలనొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలొస్తాయి.

పిల్లలకి

child

మంచి కూరగాయలు అని చాలా మంది పిల్లలకి తినిపిస్తుంటారు. అయితే, నెలల వయసున్న పిల్లలకి బీట్‌రూట్ పెట్టడం అసలు మంచిది కాదు. ఇందులో హై నైట్రేట్ ఉంటుంది. ఇది నైట్రేట్ పాయిజనింగ్‌లా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 నెలల పిల్లల అంతేకంటే తక్కువ వయసు ఉన్నవారికి బీట్‌రూట్ అసలే ఇవ్వకూడదని గుర్తుంచుకోండి.

అలర్జీ

infection

ప్రతి ఒక్కరికీ అన్నీ కూరగాయలు పడవు. కొంతమందికి అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌ తింటే కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమంది ఈ బీట్‌రూట్ ఉడికించేటప్పుడు ఆ వాసనని పీల్చడం వల్ల ఉబ్బసం వంటి సమస్యలొచ్చినట్లుగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, ఇది అందరికీ కాదు. కొంతమందికి ఈ సమస్య ఉండొచ్చు. అదే విధంగా, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. కాబట్టి, అజీర్ణ సమస్యలున్నవారు ఈ వెజిటేబుల్‌ని అసలే తీసుకోవద్దు. ముఖ్యంగా ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు.

క్యాన్సర్ ఉన్నవారికి

cancer

బీట్‌రూట్ క్యాన్సర్స్‌కి ముఖ్యంగా, బ్రెస్ట్, లంగ్, కొలన్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా నిరోధక సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. అయితే, ఇది డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. అలా కాకుండా ఇష్టంగా తీసుకోకూడదు. దీని వల్ల క్యాన్సర్ వంటి సమస్యలు పెరగవు. అదే విధంగా, షుగర్ ఉన్నవారు కూడా బీట్‌రూట్‌ని ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటి వల్ల షుగర్ లెవల్స్‌పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

లివర్ ప్రాబ్లమ్స్

liver problem

అదే విధంగా, బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దీనికి కారణం, బీట్‌రూట్‌లో లోహ అయాన్‌లు పేరుకుపోతాయి. అదే విధంగా, కాల్షియం తక్కువగా ఉన్నవారు కూడా బీట్‌రూట్ ఎక్కువగా తీసుకోవద్దని చెబుతున్నారు. లోబీపి సమస్యతో బాధపడేవారు, ఆ సమస్యకి ట్యాబ్లెట్స్ వాడేవారు బీట్‌రూట్ తీసుకోకపోవడమే మంచిది.

కిడ్నీలో రాళ్లు

kidney stone

బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేలా చేస్తుంది. మూత్ర ఆక్సలేట్ విసర్జనని పెంచుతుంది. కాల్షియం ఆక్సలేట్ రాళ్ల పెరిగేలా చేస్తుంది. కాబట్టి, బీట్‌రూట్‌ని తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ జ్యూస్‌ని అసలు తీసుకోకపోవడమే మంచిది.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మన చేతుల్తో చాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చేతుల పై క్రిములు మరియు బాక్టీరియా చేరుతుంటాయి. చేతులో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

మన చేతుల్తో చాల పనులు చేస్తూ ఉంటాం. కానీ చేతుల పై క్రిములు మరియు బాక్టీరియా చేరుతుంటాయి. చేతులో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 

helth tips caress

మానవ శరీరం ఎంతో ప్రత్యేకమైంది. శరీరంలో ప్రతి భాగం తన పనిని నిర్వరిస్తుంది. అయితే, శరీరంలోని చాలా భాగాల్ని మనం చేతులతో తాకుతుంటాం. అది ఏ భాగమైనా సరే మనకు తెలియకుండానే చేతులతో టచ్ చేస్తుంటాం. అది అలవాటు లేదా పొరపాటు వల్ల కావచ్చు. అయితే, శరీరంలో కొన్ని భాగాలను చేతులతో పదే పదే తాకకూడదు. నిజానికి మన చేతులతో చాలా పనులు చేస్తుంటాం. తెలిసో లేదా తెలియక చాలా వస్తువుల్ని పట్టుకుంటాం. దీంతో చేతులపై క్రిములు, బ్యాక్టీరియా చేరుతుంటాయి. ఈ చేతులతో కొన్ని సున్నితమైన భాగాల్ని తాకినప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేతులతో శరీరంలోని ఏ భాగాల్ని తాకకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

ముఖం:

శరీరంలో ముఖం చాలా సున్నితంగా ఉంటుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, దురద లేదా దదర్లు సమస్యలు రావడానికి కారణం పదే పదే మీరు చేతులతో ముఖంపై తాకుతున్నారని అర్తం. ఇది ఒక కారణం కావచ్చు. నిజానికి చేతులపై చాలా క్రిములు, ధూళి, బ్యాక్టీరియా ఉంటాయి. వీటి కారణంగా ముఖంపై అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. చేతుల్లో ఉండే సహజ నూనె ముఖం యొక్క రంధ్రాల్ని మూసివేసే ప్రమాదం ఉంది. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకుంటే చేతులతో పదే పదే తాకడం మానుకోండి.

చెవులు:

చాలా మంది చెవుల్లో వేళ్లు పెట్టుకోవడం, చేతులతో చెవుల్ని టచ్ చేయడం చేస్తూ ఉంటారు. అయితే, ఈ చిన్న అలవాటు చాలా హానికరం. చెవుల లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇలా చేతుల వేళ్లు పెట్టడం వల్ల ఏదైనా హాని జరిగే ప్రమాదం ఉంది. చేతులపై బ్యాక్టీరియా, దుమ్ము, ధూళి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ ఇన్ఫెక్షన్ కొన్ని సార్లు గొంతు వరకు వ్యాపించి మరింత ప్రమాదాన్ని కలిగించవచ్చు. అందుకే చేతులతో పదే పదే చెవుల్ని టచ్ చేయకండి.

పెదవులు, నోటి లోపల భాగం

చాలా మందికి తెలియకుండానే చేతులు పెదవులు, నోటి లోపల భాగాలకు వెళుతుంటాయి. తినేటప్పుడు సాధారణంగా మనం చేతుల్ని శుభ్రపర్చుకుంటాం. కానీ, మిగతా సమయాల్లో అంతగా క్లీన్ చేసుకోం. కానీ, నోటిలోకి వేళ్లు పెట్టుకుంటారు. చాలా మంది తిన్న తర్వాత నోటిలో ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి చేతి వేళ్లను ఉపయోగిస్తారు. అయితే, ఈ అలవాటు ఎంత మాత్రం మంచిది కాదు. ఇలా నోటిలో వేళ్లు పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా, క్రిములు కడుపులోకి చేరే ప్రమాదం పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఫుడ్ పాయిజన్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కళ్లు:

కళ్ళు మన శరీరంలో చాలా సున్నితమైన భాగం. అందుకే వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది వ్యక్తులు తమ చేతులతో పదే పదే కళ్ళను తాకుతుంటారు. అంతేకాకుండా దురద వల్ల కళ్లను రుద్దుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కళ్లలోకి ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. నిజానికి చాలా కంటి ఇన్ఫెక్షన్లు ఇలా పదే పదే చేతులతో తాకడం వల్ల వస్తాయి.

ముక్కు:

ముక్కులో వేలు పెట్టడం చెడుగా కనిపించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరం. ముక్కును పదే పదే టచ్ చేసే వ్యక్తులు ఎక్కువగా అనారోగ్యంతో ఉంటారని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. చేతి వేళ్లతో ముక్కును శుభ్రపర్చుకోవడం మానుకోండి. ముక్కును శుభ్రం చేసుకోవలసి వస్తే శుభ్రమైన గుడ్డ లేదా రుమాలు సాయం తీసుకోండి. ఇలా ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల స్టెఫిలోకాకస్ అరియస్ అనే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

మలద్వారం:

చేతులతో మలద్వారాన్ని కూడా టచ్ చేయకూడదంటున్నారు నిపుణులు. దురద పుట్టడం వల్ల లేదా చెమట పట్టడం వల్ల చాలా మంది మలద్వారాన్ని టచ్ చేస్తుంటారు. ఇది చాలా సున్నితమైన ప్రాంతం. చేతులతో మలద్వారాన్ని టచ్ చేయడం ద్వారా చేతులపై బ్యాక్టీరియా వ్యాపించే ప్రమాదం ఉంది. ఆ తర్వాత అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే మలద్వారాన్ని చేతులతో తాకడం మానుకోండి.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.



Pumpkin Seeds benefits of eating pumpkin seeds include boosting bone health, sexual gumadi kaaya ginjalu

 Pumpkin Seeds : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా సరైన టైమ్ కి ఆహారమైన నిద్ర అయినా ఉండడం లేదు. దీనికి గల కారణం వారి బిజీ లైఫ్ లో వచ్చే జీవనశైలిలో మార్పులు.

gumadi kaaya
helthtipscaress


మరి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. వీటన్నిటికీ సమాధానం… గుమ్మడికాయ గింజలు. అవును… గింజలను తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నాణ్యత మైన నిద్రను కూడా పొందవచ్చు. ఈరోజుల్లో నాణ్యతమైన నిద్ర ఎవరికి కూడా లేదు. కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అటువంటి సుఖమైన నిద్రనివ్వగలిగే శక్తి. ఈ గుమ్మడి గింజలకు ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలలో గుమ్మడి గింజలు కూడా మొదటి స్థానం దక్కింది. కా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ గుమ్మడి గింజలు సహాయపడతాయి. శరీరాన్ని నిర్విషికరణ చేయటానికి కూడా ప్రత్యేకంగా సహాయపడుతుంది. గింజలలో ఎన్నో పోషకాలు కూడా దాగి ఉన్నాయి. తీసుకుంటే ఒక నిద్ర కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…


Pumpkin Seeds : మంచి నిద్ర కావాలా… అయితే నిద్రకు ముందు ఒక్క స్పూన్ ఈ గింజలు తిన్నారంటే… హాయిగా నిద్రిస్తారు…?

ఇప్పుడు చాలామంది కూడా ఒబేసిటీ తో బాధపడుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి ఈ గుమ్మడి గింజలు ఒక అద్భుతమైన ఔషధం. వీటిల్లో చియా గింజలు, అవిసె గింజలు, జనపనార గింజలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడికాయ గింజలు అన్నీ కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా శరీరాన్ని బరువు తగ్గించుకొనుటకు, ఇంకా శరీరాన్ని నిర్వీకరణ చేయటానికి ఎంతో దోహదపడుతుంది. వీటన్నిటిలో కూడా గుమ్మడి గింజలు చాలా పోషకాలను కలిగి ఉన్నాయి. తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ విత్తనాలను రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ తింటే చాలు మీ శరీరానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఈ గింజలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాదు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఈ గింజల వల్ల రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది. ఉండే సక్రమంగా పనిచేయగలదు.


ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉంటాయి. (LDL) వంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL)ను పెంచుతుంది. గుమ్మడి గింజల్లో ట్రిప్ట్ ఆఫ్ ఆన్ అనే ఏమైనా ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది సెరటోనిన్, మెలతోనిన్ అనే శరీరం సహజనిద్ర హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. రోజు కూడా పడుకునే ముందు ఒక టేబుల్ స్పూన్ తింటే మంచి నాణ్యత మైన నిద్ర మీ సొంతం అవుతుంది. ఇందులో మెగ్నీషియం కండరాలు, నరాలను మరింత సడలింప చేస్తుంది. ఈ విత్తనాలలో జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. జ్ఞాపకశక్తి కూడా పెంచబడుతుంది. ముఖ్యంగా జింకు నరాల సిగ్నలింగ్, మెదడు అభివృద్ధిలో కూడా ముఖ్యపాత్రను పోషించగలదు. గుమ్మడికాయ గింజల్లో జింక్, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. జింకు గాయాలను నయం చేయగలదు. ఇంకా జలుబుతో పోరాడడానికి ఎంతో సహాయపడుతుంది. ఇంకా విటమిన్ E ఏంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వాపులను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

vitaminD hair fall sun set sweat pain శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

 శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి రోజుకు 20-40 ఎంజీ/ఎంఎల్ విటమిన్ డి అవసరం. ఈ స్థాయి తక్కువగా ఉంటే, అది శరీరంలోని వివిధ అవయవాల పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు.

శరీరంలో విటమిన్ డి లోపాన్ని అనేక లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. దీన్ని సకాలంలో అర్థం చేసుకోవడం మరియు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేకపోతే ఈ లోపం పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. మీ శరీరంలో తగినంత విటమిన్ డి ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో చూద్దాం.

helthtipscaress


భరించలేని కండరాల నొప్పి.

విటమిన్ డి లోపం వల్ల కండరాల నొప్పి వస్తుంది. చాలా మంది దీనిని అలసిపోతున్నట్టుగా భావిస్తారు. ఇది సహజమే అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కొన్నిసార్లు అది మీరనుకునేంత తేలికైనది కాకపోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఈ సమస్య తగ్గకపోతే, మీరు వెంటనే అప్రమత్తం కావాలి.


ఆందోళన, ఒత్తిడి కలుగుతుందా..

వేసవిలో చెమటలు పట్టడం సహజమే, కానీ మామూలు సమయాల్లో మీ నుదిటిపై అనుకోకుండా చెమట కనిపించడం గమనించినట్లయితే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ విటమిన్ సెరోటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి మరియు మెదడు సరైన పనితీరుకు చాలా అవసరం. ఈ హార్మోన్ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. తగినంత విటమిన్ డి తీసుకోకపోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన మరియు నిరాశ కలుగుతాయి.


జుట్టు రాలడం:

విటమిన్ డి లోపం వల్ల కూడా జుట్టు రాలుతుంది. చాలామంది దీనిని జన్యుపరమైన సమస్యగా భావిస్తారు. అయితే, ఇది విటమిన్ డి లోపం వల్ల కూడా సంభవించవచ్చు. ఈ విటమిన్ లోపం తలపై ఫోలికల్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఫలితంగా, జుట్టు సమస్యలు మొదలవుతాయి. విటమిన్ డి లోపం యొక్క లక్షణాలలో కీళ్ల నొప్పులు కూడా ఒకటి. ఈ విటమిన్ లోపం వల్ల ఉబ్బరం, విరేచనాలు మరియు మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.


విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి..

విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుందని దాదాపు అందరికీ తెలుసు. రోజుకు 15-30 నిమిషాలు ఎండలో గడపడానికి ప్రయత్నించండి. ఉదయం 7-10 గంటల మధ్య వచ్చే సూర్యకాంతి మరింత మెరుగ్గా ఉంటుంది. అలాగే, మీరు మీ ఆహారంలో తగినంత మొత్తంలో విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే చేపలు, పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్డు సొనలు మరియు తృణధాన్యాల ఆహారాలు. సమస్య సహజంగా పరిష్కారం కాకపోతే, మీరు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.