రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిది

 

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఎవరన్నా కాదన్నా ఇది నిజం. బయట మనం ఏం తిన్నా అన్నం తిన్నంత తృప్తి ఉండదు. మరి అన్నాన్ని ఎప్పుడు తింటే హెల్త్‌ పరంగా మంచిదో తెలుసుకోండి.

రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిదిఅన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు బరువు పెరగడమనే సమస్య కారణంగా అన్నం తినడాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
అన్నం బదులు ఇతర ఫైబర్ రిచ్ క్వినోవా వంటి చిరుధాన్యాలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, వాటిని ఎంత తిన్నా అన్నం తిన్నట్లుగా ఉండదు. అందుకోసం, అన్నం ఎలా తినాలి, రోజులో ఎప్పుడు తింటే మంచిదో తెలుసుకోండి.
కొన్ని అధ్యయనాల ప్రకారం అన్నాన్ని లంచ్‌లో తినడం చాలా మంచిది. కారణం అన్నంలో బి విటమిన్స్ ఉండడమే. బ్లాక్ రైస్ వంటివి బ్రెయిన్ ఫంక్షన్‌ని మెరుగ్గా చేస్తుంది. నిజానికీ ఈ బ్లాక్ రైస్‌తో చేసిన అన్నంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

వైట్ రైస్‌లో

రీసెర్చ్‌లో భాగంగా తేలిన విషయమేంటంటే.. చాలా మంది తెల్లని బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇందులో పోషకాలు, ఫైబర్‌లు బ్రౌన్‌రైస్, గ్రే రైస్‌లతో పోలిస్తే తక్కువ. మనం తెల్లని రైస్‌ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో షుగర్ పెరుగుతుంది. దీని బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, హోల్ గ్రెయిన్స్‌ తీసుకుంటే అందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాటిని తినడం మంచిది.

మనం ఏ రైస్ ఎంత మంచిదైనప్పటికీ మనం తినే రైస్ మోతాదులోనే తినాలని గుర్తుంచుకోండి. మనం ఎక్కువగా తెల్లని రైస్ తసీుకుంటాం. ఇందులో కాస్తా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. బ్రౌన్‌రైస్, ఇతర గ్రెయిన్స్‌తో పోలిస్తే. కాబట్టి, జాగ్రత్త అవసరం. పైగా విటమిన్స్, ఫైబర్, మినరల్స్ కావాలనుకుంటే కచ్చితంగా బ్రౌన్‌రైస్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తింటే చాలా మంచిది.

అన్నం త్వరగా జీర్ణమైనప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం తినడం అంత మంచిది కాదు. బియ్యంలో స్టార్చ్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని ఈజీగా పెంచుతాయి. ఎనర్జీని తగ్గిస్తాయి. బియ్యంలోని కొన్ని గుణాల కారణంగా సరిగా తీసుకోకపోతే మన బాడీలో ఫ్యాట్ పెరిగి బరువు పెరుగుతారు.

కొబ్బరి నీళ్లు పొరపాటున కూడా ఎవరు తాగకూడదో తెలుసా? ఎంత దూరంగా ఉంటే అంత మంచిది




కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొబ్బరి నీళ్లకి కొందరు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు ఎవరికి హానికరమో తెలుసుకుందాం.


కొబ్బరి నీళ్లలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం, కానీ మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది హానికరం. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది హైపర్‌కలేమియా (రక్తంలో అధిక స్థాయి పొటాషియం) కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, క్రమరహిత హృదయ స్పందన, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు

ముల్లంగి ఆకులను పారేస్తున్నారా? వీటి అస్సలు ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినేస్తారు!

 ముల్లంగి దుంపను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ, చాలామంది ముల్లంగి ఆకులను పారేస్తుంటారు. నిజానికి ముల్లంగి ఆకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో విటమిన్లు (A, C, K), ఖనిజాలు (కాల్షియం, ఐరన్, పొటాషియం), ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ముల్లంగి ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:







ముల్లంగి ఆకుల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.ఈ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్లంగి ఆకుల్లో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ A ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ముల్లంగి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. దీనిలో ఐరన్ ఉంటుంది, ఇది జుట్టును బలపరచడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముల్లంగి ఆకులు సహజసిద్ధమైన డీటాక్సిఫైయర్‌లుగా పనిచేస్తాయి మరియు శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

 

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Head Massage: హెడ్‌ మసాజ్‌ తరచు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ లాభాలు, తలకు మర్దన ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!​​Head Massage: ఒత్తైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు ఒత్తైన జుట్టు కావాలనే ఆశ ఉంటుంది. చాలామంది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. రకరకాల ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు, ఖరీదైన హెయిర్‌ ప్రాడెక్ట్స్‌ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉంటూనే సింపుల్‌ హెడ్‌ మసాజ్‌తో అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ కుదుళ్లను దృఢంగా ఉంచడమే కాదు, మాడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెడ్‌ మసాజ్‌ ప్రయోజనాలు, తలకు మర్దన ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..

హెడ్‌ మసాజ్‌ వ్లల హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ మెరుగ్గా సరఫరా అవుతుంది. మాడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగితే.. జట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
​Potato Pack: బంగాళాదుంప రసాన్ని ఇలా రాస్తే.. పిగ్మెంటేషన్‌ మాయం అవుతుంది..!

ఒత్తుగా పెరుగుతుంది..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెడ్‌ మసాజ్‌ విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు సమస్యలు ఉంటే వాటికి చెక్‌ పెట్టడానికి తల మర్దన సహాయపడుతుంది.

Head Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!

Authored Byరాజీవ్ శరణ్య | Samayam Telugu | Updated: 5 Feb 2024, 5:17 pm
Subscribe

Head Massage: హెడ్‌ మసాజ్‌ తరచు చేస్తే.. జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ లాభాలు, తలకు మర్దన ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

Samayam TeluguHead Massage: మీ తలకు ఇలా మసాజ్‌ చేస్తే.. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది..!
​​Head Massage: ఒత్తైన, మృదువైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకోని వారుండరు. అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు ఒత్తైన జుట్టు కావాలనే ఆశ ఉంటుంది. చాలామంది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. రకరకాల ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు, ఖరీదైన హెయిర్‌ ప్రాడెక్ట్స్‌ వాడుతుంటారు. అయితే.. ఇంట్లో ఉంటూనే సింపుల్‌ హెడ్‌ మసాజ్‌తో అందమైన, ఒత్తైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. హెడ్‌ మసాజ్‌ కుదుళ్లను దృఢంగా ఉంచడమే కాదు, మాడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హెడ్‌ మసాజ్‌ ప్రయోజనాలు, తలకు మర్దన ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది..

హెడ్‌ మసాజ్‌ వ్లల హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణ పెరుగుతుంది. జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ మెరుగ్గా సరఫరా అవుతుంది. మాడుకు రక్తప్రసరణ మెరుగ్గా జరిగితే.. జట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఇలా తరచూ మర్దన చేయడం వల్ల జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
Potato Pack: బంగాళాదుంప రసాన్ని ఇలా రాస్తే.. పిగ్మెంటేషన్‌ మాయం అవుతుంది..!

ఒత్తుగా పెరుగుతుంది..

నూనెతో తరచూ మర్దన చేసుకోవడం వల్ల కురులు మిలమిలా మెరుస్తాయి. అలాగే ఒత్తుగా కూడా కనిపిస్తాయి. చివర్లు చిట్లడం వంటి సమస్యలను సైతం దూరంగా ఉంచడంలోనూ మసాజ్ ఉపయోగపడుతుంది.
ఈ ఫుడ్స్ అతిగా తింటే.. జుట్టు కుచ్చులు, కుచ్చులుగా రాలుతుంది..!

ఒత్తిడి తగ్గుతుంది..

ఒత్తిడి కారణంగా హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. హెడ్‌ మసాజ్‌ విశ్రాంతిని ప్రేరేపిస్తుంది, ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణంగా.. జుట్టు సమస్యలు ఉంటే వాటికి చెక్‌ పెట్టడానికి తల మర్దన సహాయపడుతుంది.

హెయిర్ ఫోలికల్స్ యాక్టివేట్‌ అవుతాయి..

సున్నితంగా తలకు మర్దన చేస్తే.. హెయిర్‌ ఫోలికల్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. జుట్టు త్వరగా, ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. తరచూ మర్దన చేసుకోవడం ద్వారా తలలో చుండ్రు చేరకుండా జాగ్రత్తపడచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి.

ఇలా మసాజ్‌ చేయండి..

  • మీరు తలకు మర్దన చేసుకునే ముందు ప్రశాంతమైన, సౌకర్యవంతమైన చోటును సెలెక్ట్‌ చేసుకోండి. ఆ ప్రదేశంలో లైట్లను డిమ్‌ చేయండి, రిలాక్సింగ్‌ మ్యూజిక్‌ ప్లే చేసుకోండి. ఇది మీకు రిలాక్సింగ్‌ మూడ్‌ సెట్‌ చేస్తుంది.
  • కొబ్బరి నూనె, ఆలివ్, జోజోబా నూనెలు మసాజ్‌కు బెస్ట్‌ ఆప్షన్స్‌. ఈ నూనెలు హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తాయి.
  • మసాజ్‌ ఆయిల్‌ డబుల్‌ బాయిలింగ్‌ పద్ధతిలో గోరువెచ్చగా వేడి చేయండి.
  • మసాజ్‌ చేయడానికి ముందు మీ జుట్టును సెక్షన్స్‌గా విభజించండి. చేతి వేళ్లతో కొంచెం మొత్తంలో నూనె తీసుకుని. మీ మెడ ప్రాంతం నుంచి నూనెను మీ తలకు సమాంతరంగా అప్లై చేయండి.
  • చేతివేళ్లను ఉపయోగించి, సున్నితంగా.. వృత్తాకార కదలికలతో మీ తలపై మసాజ్‌ చేయండి. హెయిర్‌ ఫాల్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతాల వద్ద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. 10-15 నిముషాల పాటు మసాజ్ కొనసాగించండి. మీ చేతి వేళ్లతో ప్రెజర్‌ పాయింట్స్‌ వద్ద ఒత్తిడి ఉంచండి. ఇవి మిమ్మల్ని రిలాక్స్‌ చేస్తాయి.
  • ఆ తర్వాత.. గంట వరకు ఆరనిచ్చి, మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయండి.


గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

జుట్టుకి నూనె చాలా ముఖ్యం

 

ఆరోగ్యకరమైన జుట్టుకి నూనె చాలా ముఖ్యం. మరి ఈ నూనె ఎప్పుడు రాస్తే మంచిదో తెలుసుకోండి.

జుట్టుకి నూనె రాసి రాత్రంతా అలానే ఉంటే జుట్టు పెరుగుతుందా..జుట్టు ఆరోగ్యానికి ఆయిల్ మసాజ్ చాలా మంచిది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. జుట్టు సమస్యల్ని దూరం చేయడంలో ఆయిల్ మసాజ్ ముందుంటుంది. దీని వల్ల ఎలాంటి లాభాలున్నాయో, ఎంత టైమ్ నూనె రాసుకుంటే మంచిదో తెలుసుకోండి.

ఆయిల్ మసాజ్..

చాలా మంది నూనె జుట్టు ఆరోగ్యానికి మంచిదని చాలాసేపటి వరకూ జుట్టుకి నూనె పెట్టుకుని ఉంటారు. కానీ, ఇందులో నిజం లేదని చెబుతున్నారు నిపుణులు.

గంట సమయం..

నిజానికీ ఓ రాత్రంతా జుట్టుకి నూనె రాయడం వల్ల మరీ అదనపు లాభాలు ఏం ఉండవు. తలస్నానానికి ఓ గంట ముందు జుట్టుకి నూనె సరిపోతుందని ఆయుర్వేదం చెబుతుంది. పొడి జుట్టుకోసం గంట, నార్మల్ హెయిర్ కోసం 30 నుంచి 45 నిమిషాలు.. ఆయిలీ హెయిర్ కోసం 15 నుంచి 20 నిమిషాలు సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

జలుబు ఉన్నప్పుడు..

జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాలు సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలకి కూడా 10 నుంచి 15 నిమిషాలు చాలు. మరీ ఎక్కువసేపు నూనె రాయడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

రాత్రంతా నూనె తలపై ఉంచితే..

రాత్రంతా తలకి నూనె రాసి ఉంచడం అంత మంచిది కాదు. దీని వల్ల కఫ దోషం పెరుగుతుంది. దగ్గు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు పెరుగుతాయి. రాత్రంతా జుట్టుకి నూనె ఉంటే చుండ్రు పెరుగుతుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రాత్రంతా నూనె తలపై ఉంచితే.

 

రాత్రంతా నూనె తలపై ఉంచితే..

రాత్రంతా తలకి నూనె రాసి ఉంచడం అంత మంచిది కాదు. దీని వల్ల కఫ దోషం పెరుగుతుంది. దగ్గు, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు పెరుగుతాయి. రాత్రంతా జుట్టుకి నూనె ఉంటే చుండ్రు పెరుగుతుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

జలుబు ఉన్నప్పుడు..

 

జలుబు ఉన్నప్పుడు..

జలుబు వంటి సమస్యలు ఉన్నప్పుడు కేవలం 15 నిమిషాలు సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. పిల్లలకి కూడా 10 నుంచి 15 నిమిషాలు చాలు. మరీ ఎక్కువసేపు నూనె రాయడం అంత మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.