ట్రెండింగ్

             కాన్సర్

కాన్సర్

నేటికాలంలో కాన్సర్స్ వ్యాధి పెరిగిపోయింది. లింగబేధం లేకుండా చాలా మందిని బలితీసుకుంటుంది. అలాంటి కాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి.

  • Tattoo: పచ్చబొట్టు వేసుకునే వారికి క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

    Tattoo: పచ్చబొట్టు వేసుకునే వారికి క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వంటి కారణాల వల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. ఇందులో కాన్సర్స్ కూడా ఒకటి. కాన్సర్స్ అనేది బాడీలో ఏ భాగానికైనా రావొచ్చు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, ప్రొస్టేట్, పేగు, జీర్ణాశయ, లివర్ ఇలా 100 రకాల కాన్సర్స్ ఉన్నాయి. గడిచిన కాలంలో చాలా మంది కాన్సర్స్ బారినపడి ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇతర ఆరోగ్య సమస్యలకి గురికావడం జరుగుతుంది.

కాన్సర్

సాధారణంగా శరీరంలోని కణ విభజనలు ఓ క్రమ పద్ధతిలో జరుగుతాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ లేకుండా పెరగి కణ సమూహాలుగా ఏర్పడడాన్నే క్యాన్సర్ అంటారు. ఈ కణ సమూహాలని కణితి (ట్యూమర్) అని అంటారు. ఈ క్యాన్సర్ స్థానిక కణజాలంపై దాడి చేయడమే కాకుండా శరీరంలోని రక్తం, శోషరస వ్యవస్థ, ఇతర భాగాలకి కూడా వ్యాపిస్తుంది. దీని గురించి సరైన అవగాహన లేకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కారణాలు..

క్యాన్సర్స్ రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి.

  • కొంతమందికి ఇది వంశపారపర్యంగా వస్తే

  • మరికొంతమందికి వర్కౌట్ చేయకపోవడం వంటి వాటి వల్ల వస్తాయి.

  • రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కూడా సమస్య ఉంటుంది.

  • ఉప్పు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం

  • పోషకాహారం తీసుకోకపోవడం

  • పొగాకు, మద్యం తీసుకోవడం

వంటి కారణాల వస్తాయి.

  • మన శరీర కణాలు పనిచేసే విధానం వల్ల కూడా సమస్య వస్తుంది.

  • రేడియేషన్ ప్రభావం కారణంగా కూడా సమస్య వస్తుంది.


లక్షణాలు..

  • అజీర్ణం, గుండెల్లో మంట

  • రాత్రుళ్ళు చెమట పట్టడం

  • గొంతు, ముక్కు నుంచి రక్తం కారడం

  • దగ్గు

  • ఊపిరి ఆడకపోవడం

  • ఆకలి లేకపోవడం

  • సడెన్‌గా బరువు తగ్గడం

  • మింగడంలో ఇబ్బంది

  • రక్త వాంతులవ్వడం

  • మూత్రంలో రక్తం

  • మూత్ర విసర్జన సమయంలో ఇబ్బంది

  • శరీరంలో కొత్తగా మచ్చలు, కణితులు ఏర్పడడం

  • నోటి లోపల తెలుపు, ఎరుపు బొబ్బలు

  • రొమ్ము, చనుమొలల్లో మార్పులు


క్యాన్సర్ ట్రీట్మెంట్...

ఇది వ్యాధి తీవ్రతని బట్టి ఉంటుంది. ఈ మధ్యకాలంలో అత్యంత అధునాతన కీమోథెరపీ, రెడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ, ఇమ్యునోథెరపీ, వంటి ట్రీట్‌మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. సక్సెస్ రేటు అనేది క్యాన్సర్ రకం, తీవ్రతని బట్టి ఉంటుంది.

టెస్టులు…

ఈ సమస్యని కొన్ని టెస్టుల ద్వారా గుర్తించొచ్చు. కొన్నిసార్లు లక్షణాలని చూసి డాక్టర్ జన్యు పరీక్షలు, రక్తపరీక్షలు, ఇమేజింగ్ టెస్ట్‌లు చేయిస్తారు. బయాప్సీలు వంటి క్యాన్సర్ టెస్టుల ద్వారా కూడా సమస్యని గుర్తించొచ్చు. క్యాన్సర్స్‌ని మొదట్లోనే గుర్తిస్తే క్యాన్సర్ మరణాల్లో సగానికి పైగా మరణాల రేట్లు తగ్గుతాయి. వీటితో పాటు ఆహారపు అలవాట్లు, లైఫ్స్టైల్స్ మార్చుకుంటే క్యాన్సర్స్ బారిన పడకుండా జాగ్రత్తపడొచ్చు.

కాబట్టి ముందు నుంచి ఏదైనా లక్షణాలు గుర్తిస్తే వెంటనే టెస్టులు చేయించుకోవాలి. వీటితో పాటు సంవత్సరానికి ఓసారైనా బాడీ చెకప్స్ చేయించుకోవాలి. అదే విధంగా, మంచి లైఫ్‌స్టైల్ పాలో అవ్వాలి. తాజా పండ్లు కూరగాయలు తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, వర్కౌట్స్ వీటితో పాటు ఒత్తిడి లేకుండా చూసుకోవడం, బాడీని రిలాక్స్‌గా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు ఫాలో అయితే చాలా వరకూ సమస్యల్ని ముందుగానే దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ ఫాలో అయితే క్యాన్సర్ తో పాటు చాలా ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టొచ్చు.




కొలెస్ట్రాల్


కొలెస్ట్రాల్ బాడీలో పెరిగితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా బరువు పెరుగుతారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
కొలెస్ట్రాల్

లక్షణాలు..

కొలెస్ట్రాల్ మన బాడీలో పెరిగిందనడానికి చాలా లక్షణాల ద్వారా కనిపెట్టొచ్చు. వీటిని కొన్నిసార్లు గుర్తించలేం. కానీ, కొన్నిసార్లు ఆ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకోండి.

ఛాతీలో నొప్పి..

హై కొలెస్ట్రాల్ కారణంగా ధమనుల్లో ఫలకం ఏర్పడుతుంది. ఇది ఛాతీలో అసౌకర్యం, నొప్పికి కారణమవుతుంది. ఎక్కువగా ఛాతీలో నొప్పి వస్తుంటే అందులో ముక్యంగా కొలెస్ట్రాల్ పెరిగిందనుకోవచ్చు.

చర్మంపై కొవ్వు నిల్వలు..

ఇవి చిన్న చిన్న కురుపుల్లా ఏర్పడతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే చర్మంపై జాన్థోమాస్ అనే పసుపు రంగులో ఉండే కొవ్వు నిల్వలు కనిపిస్తాయి. ఇవి చర్మం, ముఖ్యంగా కళ్ళు, మోచేతుల చుట్టూ కనిపిస్తాయి.

ఊపిరి ఆడకపోవడం..

ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్తప్రవాహం తగ్గడం, శ్వాసకోశ పనితీరు ప్రభావితమవుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ లక్షణాన్ని చూసి కొవ్వుపెరిగిందని గుర్తించొచ్చు.

అలసట..

ముఖ్య అవయవాలకి రక్తప్రసరణ తగ్గడం వల్ల అలసట, నీరసం ఏర్పడుతుంది.

PAD (పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్) లక్షణాలు..

కాళ్ళలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల కాళ్ళలో తిమ్మిరి, బలహీనత రావొచ్చు.

దృష్ఠి సమస్యలు..

కంటికి సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే దృష్టి సమస్యలు ఏర్పడతాయి.

అయితే, ఇప్పుడు చెప్పే లక్షణాలు ఇతర సమస్యల కారణంగా కూడా రావొచ్చు. కాబట్టి, వీటిని ముందుగానే గుర్తించి సరైన ట్రీట్‌మెంట్ చేసుకోవడం అవసరం. ఈ లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

కారణాలు..

ఇక కొలెస్ట్రాల్ పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

ఫుడ్..

నాన్‌వెజ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, ఫ్యాట్ మిల్క్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి.

వర్కౌట్ చేయకపోవడం..

శరీరానికి తగినంత వర్కౌట్ లేకపోయినా కూడా బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరుగుతుంది.

అధిక బరువు

అధిక బరువుతో బాధపడేవారిలో ఎక్కువగా లిపో ప్రోటీన్ ఉంటుంది. దీని వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

కుటుంబ చరిత్ర..

కుటంబ చరిత్ర కారణంగా కూడా చాలా మందిలో కొలెస్ట్రాల్ పెరుగుుతంది. ఇంట్లోని పెద్దవారు, తోబుట్టువులకి కొలెస్ట్రాల్ సమస్య ఉంటే అది ఇంట్లోని వారికి కూడా వస్తుంది.

వయసు.. లింగం..

కొన్నిసార్లు వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

ధూమపానం.. పొగాకు పొగ రక్తనాళాలను దెబ్బతీయడమే కాకుండా HDL కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.

అనారోగ్య సమస్యలు..

షుగర్, హైపోథైరాయిడిజం, మూత్రపిండాల సమస్యల వంటి ఆరోగ్య సమస్యలు కూడా కొలెస్ట్రాల్ జీవక్రియని ప్రభావితం చేస్తాయి.

మెడిసిన్..

కొన్నిసార్లు అనేక సమస్యలకి వాడే మందుల కారణంగా కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతుంది.

తగ్గేందుకు ఏం చేయాలి?

కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

మంచి పోషకాహారం..

మనం తీసుకునే డైట్ కూడా కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. కాబట్టి, మంచి పోషకాహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌తో కూడిన ఫుడ్‌ని తీసుకోండి. వీటితో పాటు ప్రాసెస్డ్, మీట్ వంటి ఫుడ్స్‌ని, ట్రాన్ ఫ్యాట్స్‌ని తగ్గించండి.

రెగ్యులర్ వర్కౌట్..

వారానికి కనీసం 150 నిమిషాల పాటు వాకింగ్, ఏరోబిక్ వంటి వర్కౌట్స్ చేయండి. అదే విధంగా స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేయండి.

హెల్దీ వెయిట్..

వీటితో పాటు బరువు పెరగకుండా చూసుకోండి. మీ ఎత్తుకి తగ్గ బరువుని మెంటెయిన్ చేయండి.

చెడు అలవాట్లకి దూరంగా..

ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లకి దూరంగా ఉండండి.

వీటితో పాటు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ డాక్టర్ ఇచ్చే సలహాలు పాటిస్తే కొలెస్ట్రాల్ సమస్యని మన దగ్గరికి రాకుండా చేయొచ్చు.

ఆలివ్ ఆయిల్

 

ఆలివ్ ఆయిల్ గుండెకి చాలా మంచిది. ముఖ్యంగా వంట, బేకింగ్ చేయడానికి ఇది చాలా మంచిది. ఇందులో మోన్ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తాయి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది కొన్ని డిషెస్, సలాడ్స్, బేకింగ్ వంటి వాటికి మైల్డ్ ఫ్రూటీ ఫ్లేవర్‌ని అందిస్తుంది. ముప్పావుకప్పు ఆలివ్ ఆయిల్‌ని రోజు తీసుకోవడం మంచిది.

బటర్‌ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయంగా ఉందా, ఫ్యాట్ పెరగకుండా వెన్న బదులు ఏం వాడొచ్చొంటే

 

బటర్ మనం అంత ఎక్కువగా వీటితో వంటలు చేసుకోకపోయినా కొన్ని వంటలకి బటర్ లేకపోతే అసలు రుచే లేదని చెప్పొచ్చు. కానీ, దీనిని తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, ఆల్టర్నేటివ్‌గా మనం ఏం తినొచ్చో తెలుసుకోండి.

బటర్‌ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని భయంగా ఉందా, ఫ్యాట్ పెరగకుండా వెన్న బదులు ఏం వాడొచ్చొంటేటోస్ట్, పరాఠా, నాన్, ఇలా కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌కి బటర్‌తోనే అసలు మజా. వీటితో తింటేనే ఆ రుచి మహా గొప్పగా ఉంటుంది. అయితే, కొలెస్ట్రాల్ గురించి ఇప్పుడు పెరిగిన అవగాహనతో కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దంటున్నారు. అందులో బటర్ కూడా ఒకటి. బటర్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది చెబుతుంటారు. అయితే, అది మనం తినే విధానాన్ని బట్టి ఉంటుంది. అందులోనూ బటర్‌ని అవాయిడ చేయాలనుకుంటే దాని బదులు హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి.
మనం బటర్‌ని పోషకాలతో కూడిన ఇతర ఆల్టర్నేటివ్స్‌తో తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. మన డైట్‌లో హెల్దీ ఫ్యాట్స్ యాడ్ చేయడం మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోనూ కొన్ని ఫుడ్స్ ప్లాంట్ బేస్డ్, ఎక్కువగా పోషకాలతో నిండి ఉంటుంది. అలాంటి ఫుడ్స్‌ని మనం బటర్ బదులు వాడుకోవచ్చు.

గ్రీక్ యోగర్ట్ ఫ్యాట్ తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని మనం బేకింగ్‌లో వాడొచ్చు. దీని వల్ల మంచి క్రీమీ టేస్ట్ ఉంటుంది. కాస్తా పుల్లని రుచి కూడా వస్తుంది. ఫుల్ ఫ్యాట్, లోఫ్యాట్ ఫుడ్స్‌లో కూడా వాడొచ్చు. దీనిని మనం ఏ కాంబినేషన్‌తో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది.


రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిది

 

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఎవరన్నా కాదన్నా ఇది నిజం. బయట మనం ఏం తిన్నా అన్నం తిన్నంత తృప్తి ఉండదు. మరి అన్నాన్ని ఎప్పుడు తింటే హెల్త్‌ పరంగా మంచిదో తెలుసుకోండి.

రోజులో అన్నం ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు, రాత్రుళ్లు అన్నం తినాలనిపిస్తే ఏం చేస్తే మంచిదిఅన్నం అనేది ప్రతీ ఒక్కరి కడుపు నిండేది. చపాతీలు, రోటీలు ఏవీ తిన్నా కూడా ఓ ముద్ద తింటేనే కడుపు నిండుగా ఉంటుంది. అందుకే, ప్రతీ ఒక్కరూ కడుపు నిండుగా అన్నం తింటారు. అందరి ఆకలి తీర్చే అన్నాన్ని ఇప్పుడు తగ్గించి తినాల్సిన పరిస్థితి. దీనికి కారణం బరువు పెరగడం. ఇప్పుడు బరువు పెరగడమనే సమస్య కారణంగా అన్నం తినడాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
అన్నం బదులు ఇతర ఫైబర్ రిచ్ క్వినోవా వంటి చిరుధాన్యాలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, వాటిని ఎంత తిన్నా అన్నం తిన్నట్లుగా ఉండదు. అందుకోసం, అన్నం ఎలా తినాలి, రోజులో ఎప్పుడు తింటే మంచిదో తెలుసుకోండి.
కొన్ని అధ్యయనాల ప్రకారం అన్నాన్ని లంచ్‌లో తినడం చాలా మంచిది. కారణం అన్నంలో బి విటమిన్స్ ఉండడమే. బ్లాక్ రైస్ వంటివి బ్రెయిన్ ఫంక్షన్‌ని మెరుగ్గా చేస్తుంది. నిజానికీ ఈ బ్లాక్ రైస్‌తో చేసిన అన్నంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

వైట్ రైస్‌లో

రీసెర్చ్‌లో భాగంగా తేలిన విషయమేంటంటే.. చాలా మంది తెల్లని బియ్యాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ, ఇందులో పోషకాలు, ఫైబర్‌లు బ్రౌన్‌రైస్, గ్రే రైస్‌లతో పోలిస్తే తక్కువ. మనం తెల్లని రైస్‌ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగే ప్రమాదం ఉంది. దీంతో షుగర్ పెరుగుతుంది. దీని బదులు బ్రౌన్ రైస్, రెడ్ రైస్, హోల్ గ్రెయిన్స్‌ తీసుకుంటే అందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాటిని తినడం మంచిది.

మనం ఏ రైస్ ఎంత మంచిదైనప్పటికీ మనం తినే రైస్ మోతాదులోనే తినాలని గుర్తుంచుకోండి. మనం ఎక్కువగా తెల్లని రైస్ తసీుకుంటాం. ఇందులో కాస్తా కేలరీలు ఎక్కువగానే ఉంటాయి. బ్రౌన్‌రైస్, ఇతర గ్రెయిన్స్‌తో పోలిస్తే. కాబట్టి, జాగ్రత్త అవసరం. పైగా విటమిన్స్, ఫైబర్, మినరల్స్ కావాలనుకుంటే కచ్చితంగా బ్రౌన్‌రైస్ వంటి హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం వేళలో తింటే చాలా మంచిది.

అన్నం త్వరగా జీర్ణమైనప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రాత్రుళ్లు అన్నం తినడం అంత మంచిది కాదు. బియ్యంలో స్టార్చ్, కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్‌ని ఈజీగా పెంచుతాయి. ఎనర్జీని తగ్గిస్తాయి. బియ్యంలోని కొన్ని గుణాల కారణంగా సరిగా తీసుకోకపోతే మన బాడీలో ఫ్యాట్ పెరిగి బరువు పెరుగుతారు.

కొబ్బరి నీళ్లు పొరపాటున కూడా ఎవరు తాగకూడదో తెలుసా? ఎంత దూరంగా ఉంటే అంత మంచిది




కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నీళ్లు సహజంగా తీపిగా, తాజాగా, పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, శక్తిని కాపాడటంలో సాయపడతాయి. శరీరంలో నీటి లోపాన్ని అధిగమించడానికి కొబ్బరి నీరు అద్భుత ఎంపిక. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది మీ శరీరం నుంచి అదనపు నీటిని, వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి, ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే, ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ కొబ్బరి నీళ్లకి కొందరు దూరంగా ఉండాలి. కొబ్బరి నీళ్లు ఎవరికి హానికరమో తెలుసుకుందాం.


కొబ్బరి నీళ్లలో పొటాషియం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం ఉంటుంది. ఇది శరీరానికి చాలా అవసరం, కానీ మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది హానికరం. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తమ శరీరాల ద్వారా అదనపు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేరు. ఇది హైపర్‌కలేమియా (రక్తంలో అధిక స్థాయి పొటాషియం) కు దారితీస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, క్రమరహిత హృదయ స్పందన, తీవ్రమైన సందర్భాల్లో గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు

ముల్లంగి ఆకులను పారేస్తున్నారా? వీటి అస్సలు ప్రయోజనాలు తెలిస్తే రోజూ తినేస్తారు!

 ముల్లంగి దుంపను చాలామంది ఇష్టంగా తింటారు. కానీ, చాలామంది ముల్లంగి ఆకులను పారేస్తుంటారు. నిజానికి ముల్లంగి ఆకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిల్లో విటమిన్లు (A, C, K), ఖనిజాలు (కాల్షియం, ఐరన్, పొటాషియం), ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ముల్లంగి ఆకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:







ముల్లంగి ఆకుల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.ఈ ఆకుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముల్లంగి ఆకుల్లో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుల్లో విటమిన్ A ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ముల్లంగి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి సహాయపడతాయి. దీనిలో ఐరన్ ఉంటుంది, ఇది జుట్టును బలపరచడానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ముల్లంగి ఆకులు సహజసిద్ధమైన డీటాక్సిఫైయర్‌లుగా పనిచేస్తాయి మరియు శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి సహాయపడతాయి.