Mouth Ulcers: నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి వీటి గురించి అజాగ్రత్తగా ఉండటం మంచిది. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవాలి..

 Mouth Ulcers: నోటి అల్సర్లను తక్కువగా అంచనావేయొద్దు.. ఇది ప్రమాదకర వ్యాధులకు ముందస్తు సంకేతం

నోటి పూత అనేది ఒక సాధారణ సమస్య. అందుకే చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. కానీ తరచుగా నోట్లో పుండ్లు, గాయాలు కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఇది ఓ తీవ్రమైన అనారోగ్య సమస్యకు ముందస్తు సంకేతంగా సూచిస్తుంది. కాబట్టి వీటి గురించి అజాగ్రత్తగా ఉండటం మంచిది. వైద్యుడిని సంప్రదించి అవసరమైన మందులు తీసుకోవాలి..

నోటి పూతల అనేది ఒక సాధారణ సమస్య. చాలా మంది దీనిని తీవ్రంగా పరిగణించరు. ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. సాధారణంగా నోటి లోపల, నాలుకపై లేదా బుగ్గలు, పెదవులు లేదా గొంతు లోపలి భాగంలో ఇవి సంభవిస్తాయి. ఈ గాయాలు, కొన్నిసార్లు చాలా బాధాకరంగా ఉంటాయి. తినడానికి, త్రాగడానికి, మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటాయి. ఈ గాయాలు కొన్ని రోజుల్లోనే వాటంతట అవే నయం అవుతాయి. కానీ ఇలా పదే పదే జరిగితే లేదా ఎక్కువ కాలం నయం కాకపోతే విస్మరించడం ప్రమాదకరం. ఈ గాయాలు శరీరంలోని కొన్ని తీవ్రమైన సమస్యలకు సంకేతం. పదే పదే వచ్చే నోటి పూతల వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.


పోషకాహార లోపం

నోటి పూతలే పదే పదే రావడానికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడం. విటమిన్ బి12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం నోటి పూతల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆహారంలో ఈ పోషకాలు లోపిస్తే, అది నోటి పూతలకు దారితీస్తుంది.


జీర్ణ సమస్యలు

నోటి పూతలకు మరొక కారణం జీర్ణవ్యవస్థలోని సమస్యలు. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యలు శరీరంలో టాక్సిన్స్ స్థాయిలను పెంచుతాయి. ఇది నోటి పూతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆయుర్వేదం ప్రకారం, కడుపు వ్యాధులు, శరీరంలో పిత్తం పెరగడం నోటి పూతలకు కారణమవుతాయి. మీకు జీర్ణ సమస్యలు, తరచుగా నోటి పూతలు వస్తుంటే శరీర అంతర్గత సమతుల్యతలో అంతరాయం కలిగిందనడానికి ఇదొక సూచన.


బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ

నోటి పూతలకు మరొక ప్రధాన కారణం బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. శరీర రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు శరీర ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఇది నోటిలో బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల సంభావ్యతను పెంచుతుంది. ఇది అల్సర్లకు దారితీస్తుంది.


ఒత్తిడి, ఆందోళన

ఒత్తిడి, ఆందోళన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి కూడా నోటి పూతలకు ప్రధాన కారణం కావచ్చు. మనం ఒత్తిడికి గురైనప్పుడు, శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇంకా, ఒత్తిడి శరీరంలో మంటను పెంచుతుంది. ఇది నోటి పూతలకు దారితీస్తుంది.


అంటు వ్యాధి

నోటి పూతల పునరావృతానికి తీవ్రమైన కారణం ఇన్ఫెక్షన్. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ లేదా కాండిడా ఇన్ఫెక్షన్ వంటి కొన్ని వైరల్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు నోటి పూతలకు కారణమవుతాయి. మీకు తరచుగాబరువు తగ్గుతుంటే, జ్వరం లేదా గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా వస్తుంటాయి. కాబట్టి ఇది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం


మీకు ఇలాంటి అలావాట్లు ఉన్నాయా..? గుండె తొందరగానే షెడ్డుకెళ్తుందట.

 మీకు ఇలాంటి అలావాట్లు ఉన్నాయా..? గుండె తొందరగానే షెడ్డుకెళ్తుందట.

నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

గుండె రక్తాన్ని పంప్ చేయడానికి, అవయవాలకు ఆక్సిజన్‌ను అందించడానికి, శక్తిని నిర్వహించడానికి సహాయపడుతుంది. అందువల్లన , గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం పూర్తి ఆరోగ్యానికి ముఖ్యం.. మీరు ఉదయం దినచర్య గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే.. గుండె సంరక్షణ కోసం ఎలాంటి అలవాట్లను వదిలేయాలి? 


ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు భారీగా సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి.. వయస్సు లో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ గుండె జబ్బులతోపాటు గుండె పోటు బారిన పడుతున్నాయి.. ఇలా పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంగా ఉండేందు మనం ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. ఇది శరీరమంతా రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ నేటి కాలంలో చాలా మందికి గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం మన చెడు జీవనశైలి.. వృద్ధులతో పాటు యువతలో కూడా గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో.. ఎలాంటి అలవాట్లు  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయో తెలుసుకోవడం ముఖ్యం.. గుండె సంబంధిత సమస్యలు నివారించేందుకు ఎలాంటి చెడు అలవాట్లను వదిలియాలి..? గుండె సంరక్షణ కోసం నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

గురుగ్రామ్‌లోని మారింగో ఆసియా హాస్పిటల్ కార్డియాలజీ విభాగం చైర్మన్ డాక్టర్ సంజీవ్ చౌదరి గుండె సంబంధిత సమస్యల గురించి పలు విషయాలను పంచుకున్నారు. చాలా సార్లు మన తప్పుడు అలవాట్లు గుండెను బలహీనపరుస్తాయన్నారు. చెడు జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, అధిక చక్కెర ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయన్నారు.

రోజూవారి జీవితంలో ఎలాంటి అలవాట్లను మార్చుకోవాలి..? గుండె కార్డియాలజీ విభాగం నిపుణులు ఏం చెబుతున్నారు.. ఎలాంటి సూచనలు ఇస్తున్నారు..? ఇలాంటి వివిషయాలను తెలుసుకోండి.

ధుమపానం..

సిగరెట్లు, బీడీలు గుండెకు చాలా హానికరం. సిగరెట్ పొగ కూడా మీ గుండెకు హాని కలిగిస్తుంది. ధూమపానం రక్తాన్ని చిక్కగా చేస్తుంది. దీని కారణంగా, ధమనులలో రక్తం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది.. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు మీ గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే, వెంటనే ధూమపానం మానేయండి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం..

నేటి బిజీ జీవనశైలిలో, చాలా మంది శారీరక శ్రమపై శ్రద్ధ చూపరు. కానీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు నడవడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం గుండెకు మేలు చేస్తుంది. వ్యాయామం చేయని వారికి ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

గుండె పరీక్ష చేయించుకోకపోవడం

తరచుగా ప్రజలు పెద్ద సమస్య వచ్చే వరకు డాక్టర్ వద్దకు వెళ్లరు. కానీ గుండెకు సంబంధించిన ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి, 30 సంవత్సరాల వయస్సు తర్వాత, క్రమం తప్పకుండా గుండె పరీక్ష చేయించుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్, చక్కెరను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం వల్ల గుండె జబ్బులను నివారించవచ్చు.



గుండె సంబంధిత రోగులకు గోల్డెన్ hour అనేది అత్యంత ముఖ్యమైనది. గుండె పోటు లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

 Golden Hour : గుండె సంబంధిత రోగులకు గోల్డెన్ అవర్అనేది అత్యంత ముఖ్యమైనది. గుండె పోటు లక్షణాలు, నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Golden Hour : గుండెపోటు అనేది అత్యంత ప్రాణాంతకమైనది. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. ఇంకా చెప్పాలంటే.. గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి సెకను చాలా విలువైనది. మన గుండె రక్తాన్ని పంపింగ్ చేయడాన్ని ఆపివేస్తుంది. ఇది ప్రాణాంతకమైన పరిస్థితిగా చెప్పవచ్చు.



దీని కారణంగా ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు ప్రతి సెకను చాలా విలువైనదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే.. ఒక వ్యక్తికి సకాలంలో చికిత్స అందితే, అతని ప్రాణాలను కాపాడవచ్చు. మనం గుండెపోటు నుంచి ఎలా ప్రాణాలను కాపాడవచ్చునో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


గోల్డెన్ అవర్ అంటే ఏమిటి? :

ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి గంట ఎంతో ముఖ్యం.. ఈ 60 నిమిషాలను గోల్డెన్ అవర్ అంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సమయంలో గుండెపోటు రోగికి చికిత్స చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో గుండెపోటుతో బాధపడుతున్న వ్యక్తికి తగిన చికిత్స లభిస్తే బతికే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

గుండెపోటు లక్షణాలివే :


ఛాతీలో తీవ్రమైన నొప్పి.

ఆకస్మిక తలతిరుగుడు, తలతిప్పడం

ఛాతీలో నొప్పి, మండుతున్న అనుభూతి.

భుజాలు, మెడలో నొప్పి.

ఊపిరి ఆడకపోవుట.

హార్ట్ ఎటాక్ నివారణ చర్యలివే :

గుండెపోటును నివారించడానికి, మీ ఆహారం, జీవనశైలిలో కొన్ని అవసరమైన మార్పులు చేసుకోవాలి. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, ప్రతిరోజూ 40 నిమిషాల వ్యాయామం చేస్తే, గుండెపోటు నుంచి చాలా వరకు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. అయితే, దీని కోసం మీరు మద్యం, ధూమపానాన్ని కూడా మానేయాలి. దాంతో పాటు, పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి.

Butter Milk: ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

 Butter Milk: ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు


Butter Milk: ప్రస్తుతం మండే వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు వివిధ రకాల శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ కొన్ని శారీరక రుగ్మతలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉండటం మంచిది.

కానీ వాటిలో మజ్జిగ అత్యంత ప్రయోజనకరమైనది. మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇది కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈరోజు ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కడుపు సమస్యలు ఉన్నవారు అల్పాహారంగా మజ్జిగ తాగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి కడుపు సమస్యలు తొలగిపోతాయి.మజ్జిగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి, మజ్జిగ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి

ఇందులో కాల్షియం, విటమిన్ బి12, జింక్, రిబోఫ్లేవిన్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం, మజ్జిగను పగటిపూట ఎల్లప్పుడూ తీసుకోవాలి. అలాగే, కడుపు సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా దీనిని తీసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మజ్జిగ తాగవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. మజ్జిగ తాగడం వల్ల శరీరంలో నీటి కొరత కూడా తొలగిపోతుంది.

బరువు తగ్గరు. మరి బరువు తగ్గడానికి ఏం చేయాలంటే మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేయాలి

 బరువు తగ్గాలని అనుకున్న ప్రతి ఒక్కరు ముందుగా చేసే పని వర్కౌట్స్ చేయడం. కానీ, వర్కౌట్స్ చేయడం వల్ల ఫిట్‌గా మారతారు కానీ, బరువు తగ్గరు. మరి బరువు తగ్గడానికి ఏం చేయాలంటే మన లైఫ్‌స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేయాలి. వీటి కారణంగా మెల్లిమెల్లిగా బరువు తగ్గుతారు. అందుకోసం మరి ఏం మార్పులు చేయాలో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకోండి.


మంచి డైట్..

బరువు పెంచడం, తగ్గించడంలో డైట్ కీ రోల్ పోషిస్తుంది. డైట్ అనేది సరిగ్గా ఉంటే బరువు ఈజీగా తగ్గుతారు. ఇందుకోసం ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకు ప్రోటీన్ అంటే ప్రోటీన్ తిన్నప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. కాబట్టి, ఎక్కువగా తినరు. బరువు ఈజీగా తగ్గుతారు. ప్రోటీన్ మజిల్స్‌కి కూడా మంచిది. దీంతో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోవాలి.

పోర్షన్ కంట్రోల్..

అదే విధంగా, ఒకేసారి ఎక్కువగా తినకుండా కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకోవాలి. క్యాలరీలను తక్కువ చేయడం మొదలు పెట్టాలి. దీనికోసం జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్‌ని తగ్గించాలి. వీటి బదులు హెల్దీ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, బీన్స్, నట్స్ వంటివి తినాలి.

వర్కౌట్..

అదే విధంగా రోజులో ఏదైనా ఓ వర్కౌట్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీని వల్ల బాడీ ఫిట్‌గా మారడమే కాకుండా మెటబాలిజం సరిగ్గా ఉంటుంది. మీకు ఎక్సర్‌సైజ్ చేయడం ఇష్టం లేకపోతే దాని బదులు డ్యాన్స్, యోగా, వాకింగ్, సైక్లింగ్ ఇలా ఏదైనా మీకు ఇష్టమైన వర్కౌట్‌ని రోజుకి కనీసం అరగంట ఉండేలా చూసుకోండి. వీటి వల్ల మీ బాడీ ఫ్లెక్సీబుల్‌గా కూడా మారుతుంది.

హైడ్రేట్‌డ్‌గా..

అదే విధంగా, మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలి. మన బాడీ హైడ్రేట్‌గా ఉన్నప్పుడు బాడీలోని అన్నీ అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉండడం వల్లే త్వరగా బరువు తగ్గరు. అందుకోసం కచ్చితంగా నీటిని ఎక్కువగా తీసుకోండి. దీని వల్ల కచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి.

హెర్బల్ టీలు..

కాఫీ, టీల కంటే హెర్బల్ టీలు చాలా హెల్ప్ చేస్తాయి. వీటిని తాగడం వల్ల మెటబాలిజం పెరిగి చాలా వరకూ రిజల్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, చమోమిలే టీ వంటివి ట్రై చేయొచ్చు. వీటిని తాగితే ఎక్స్‌ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఒత్తిడిని తగ్గించుకోవడం..

బరువు తగ్గాలంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం ముందుగా యోగా, ధ్యానం వంటివి చేయొచ్చు. ఒత్తిడిగా ఉన్నప్పుడు ఎంత ట్రై చేసినా బరువు తగ్గరు. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

నిద్రపోవడం..

ఇక బరువు తగ్గడంలో నిద్ర కూడా కీ రోల్ పోషిస్తుంది. ఎంత హాయిగా నిద్రపోతే మీ బాడీ అంత రిలాక్స్ అవుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. చాలా అధ్యయనాల్లో తేలిందేంటంటే నిద్రలేకపోవడం వల్లే బరువు పెరుగుతారని. కాబట్టి, బరువు తగ్గాలంటే ముందుగా నిద్రపోండి. హాయిగా నిద్రపోయేందుకు డిన్నర్‌ని రాత్రి 7 గంటల్లోపే ముగించేయండి. డిన్నర్, నిద్రకి కనీసం 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండేలా చూడండి. అదే విధంగా, రాత్రుళ్ళు గ్యాడ్జెట్స్, సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి. దీని వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. ఇవన్నీ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గుతారు.

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా చికెన్ ఎక్కువగా తినకూడదు.. ఇలా తింటేనే ఆరోగ్యం సేఫ్

చికెన్.. చాలా మంది ఇష్టంగా తినే ఫుడ్. కొంతమందికి చికెన్ లేనిదే ముద్ద దిగదు. ఇక, సండే వచ్చిందంటే చాలు చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. అయితే, ఈ రోజుల్లో చాలా మంది వారంతో సంబంధం లేకుండా చికెన్, మటన్‌ను లాగిస్తున్నారు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, లాలీపాప్, చికెన్ 65, చికెన్ కూర్మా, చికెన్ సూప్, తందూరి చికెన్ ఇలా రకరకాల పేర్లుతో చికెన్ తింటున్నారు. ఇక, ఆల్కహాల్ తాగేవారు చికెన్‌ను స్టఫ్‌గా తింటున్నారు.

చిన్నా, పెద్దా తేడా లేకుండా చికెన్‌ను ఎక్కువగా తింటున్నారు. చికెన్ తినడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ పెరుగుతాయి. నాటు కోళ్లు తింటే ఆరోగ్యానికి మంచిది.. ఫారం కోళ్లను ఎక్కువగా తింటే అనర్థం తప్పదంటున్నారు. వారానికి ఒకటి, రెండు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు. వారమంతా చికెన్ లాగిస్తే ప్రమాదం. అయితే, కొన్ని సమస్యలు ఉన్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు. ఇంతకీ వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.


అధిక కొలెస్ట్రాల్..

ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం చికెన్‌ ఎక్కువగా తింటే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతాయి. బాడీలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగితే.. గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఈ సమస్యలు ఉన్నవారు చికెన్ తక్కువ మోతాదులో తింటేనే మంచిదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా చికెన్ తక్కువ తింటే ఈ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

అధిక బరువు..

ప్రతిరోజూ చికెన్‌ తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. చికెన్‌లో ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో... శరీరం బర్న్‌ చేయలేని అదనపు ప్రోటీన్ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. అందుకే ఇప్పటికే అధిక బరువు సమస్యలతో బాధపడే వారు చికెన్ ఎక్కువగా తినకూడదు.ఒక స్టడీ ప్రకారం, మనం తీసుకునే డైట్‌కు, బరువు మధ్య సంబంధం ఉంటుంది. శాఖాహారుల కంటే నాన్-వెజ్ తినే వారి శరీర ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది.

హైపర్ టెన్షన్ సమస్యలు..

కుటుంబంలో హైపర్‌టెన్షన్‌ హిస్టరీ ఉంటే.. అలాంటి వారు తినే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతృప్త కొవ్వు, ట్రాన్స్-ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. డైరీ ఉత్పత్తులు, రెడ్‌ మీట్‌, చికెన్‌ స్కిన్‌‌లో ట్రాన్స్‌ - ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు చికెన్ తక్కువ మోతాదులో తినాలి. ఎక్కువ తింటే సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది.


మూత్రనాళ ఇన్ఫెక్షన్..

ఈ రోజుల్లో రకరకాల చికెన్ వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఏ చికెన్ పడితే ఆ చికెన్ తింటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌ (UTI) వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. MBio, అమెరికన్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, చికెన్ ఎక్కువగా తింటే.. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌‌‌‌తో సహా మరికొన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలంటే.. తాజా చికెన్‌ కొనడం, చికెన్‌ తక్కువగా తీసుకోవడం చేయాలి. చికెన్‌ను బాగా ఉడికించి తింటే ఈ సమస్యలు రావంటున్నారు.


అధిక యూరిక్ యాసిడ్..

​అధిక యూరిక్ యాసిడ్ స్థాయి ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిన తర్వాత, క్రమంగా ఈ యూరిక్ యాసిడ్ గట్టిపడటం ప్రారంభిస్తుంది. ఈ స్ఫటికాలు (యూరిక్ యాసిడ్ స్ఫటికాలు) చేతి వేళ్లు, కాలి వేళ్లు, వేరే కీళ్లలో పేరుకుపోతాయి. దీంతో.. కీళ్లనొప్పుల సమస్యతో బాధపడతారు. మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్నవారు చికెన్ ఎక్కువగా తినకూడదు. ఇలా చికెన్ ఎక్కువగా తింటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగే ప్రమాదముంది.

చికెన్ ఎలా తినాలి..

చికెన్ ఎలా పడితే అలా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ ఫ్రై, డీప్ ఫ్రై, చికెన్ పకోడి, చికెన్ బర్గర్లు లాంటి వాటికి దూరంగా ఉండాలి. తాజా చికెన్ కొని వండి తినడం మంచిది. అంతేకాకుండా చికెన్‌ను ఎక్కువగా ఉడికించి తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వండి తింటే బెస్ట్. బయట దొరికే చికెన్ ఐటమ్స్‌కి దూరంగా ఉండటమే మేలు అంటున్నారు నిపుణులు.

గమనిక..

ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.

ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ

ఈమె ఇన్‌స్టాగ్రామ్ ఫేమస్ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్. అధిక బరువుతో బాధపడేవారికి ఫిట్‌గా ఉండేందుకు మంచి డైట్స్, ఫుడ్స్ చేసే రిది శర్మ తన డైట్‌లో కొన్ని ఫుడ్స్‌ని యాడ్ చేయడం వల్ల 20 కిలోల బరువు తగ్గానని చెబుతోంది.
చాలా మంది బరువు తగ్గడానికి ఎక్కువగా ఎక్సర్‌సైజ్ చేయాలనుకుంటారు. కానీ, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ కేవలం 30 శాతమే. కచ్చితంగా బరువు తగ్గాలంటే ఫుడ్ చేంజెస్ చేయాలి. ఈ నేపథ్యంలోనే రిది శర్మ కొన్ని ఫుడ్స్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి.

బరువు తగ్గిన రిధి శర్మ..

బంగాళాదుంప, మజ్జిగ..

బంగాళాదుంప తింటే బరువు పెరుగతారని అనుకుంటారు చాలా మంది. కానీ, దీనిని తీసుకునే విధంగా తీసుకుంటే చాలావరకూ బరువు తగ్గుతారు. బంగాళాదుంపల్లో ఎక్కువగా పొటాషియం, ఫైబర్‌లు ఉంటాయి. ఇవన్నీ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. ఇక మజ్జిగ.. మజ్జిగలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, వీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బీన్స్, పప్పులు, జుకిని..

బరువు తగ్గడంలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా హెల్ప్ చేస్తాయి. బీన్స్, పప్పులు, జుకిన్ వెజిటేబుల్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయి. జుకిని వెజిటేబుల్ ఇది చూడ్డానికి కీర దోసకాయలా ఉంటుంది. కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు చేసే బీన్స్, పప్పులు, జుకినీలో ఎక్కువగా ప్రోటీన్ ఫైబర్, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. బరువు తగ్గడంలో చాలా హెల్ప్ చేస్తాయి.

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


కాలీఫ్లవర్, ఆపిల్..

కాలీఫ్లవర్‌లో కూడా కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అదే విధంగా, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో యాపిల్స్ కూడా ఉన్నాయి. ఈ పండ్లని తీసుకోవడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. బాడీకి పోషకాలు అందుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ ఫుడ్స్‌ని తీసుకుని బరువు తగ్గించుకోగలిగానని రిధి శర్మ చెబుతోంది. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు వీటిని వీలైనంతగా వారి డైట్‌లో చేర్చుకోవాలి. అయితే, ఏ ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవద్దు. మితంగానే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి.


డార్క్ చాక్లెట్, మష్రూమ్స్..

డార్క్ చాక్లెట్స్‌లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దీనిని తినడం స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. దీంతో పాటు మష్రూమ్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడంలో హెల్ప్ అవుతాయి.

టోఫు, నట్స్..

టోఫు కూడా బరువు తగ్గడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. అదే విధంగా, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్. నట్స్‌లో పోషకాలు, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.